బెజ్జంకి ఎస్ఐ తిరుపతి మంచిర్యాలలో వీరంగం సృష్టించాడు. ఎస్ఐను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన స్థానిక పోలీసులపై ఆయన దాడి చేసి పారిపోయాడు.
మంచిర్యాల: సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్ఐ తిరుపతి మంచిర్యాలలో మంగళవారంనాడు రాత్రి వీరంగం సృష్టించాడు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా వద్ద ఎస్ఐ హల్ చల్ చేశారు.
ఈ విషయమై స్థానికులు 100 కు ఫోన్ చేశారు. దీంతో అక్కడికి వచ్చిన స్థానిక పోలీసు సిబ్బందిపై కూడ ఎస్ఐ తిరుపతి పరుషంగా మాట్లాడారు.అంతేకాదు వారిపై దాడికి దిగాడు. దీంతో స్థానికులు ఎస్ఐను నిలదీశారు. ఎస్ఐ తీరును ఎండగట్టారు. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన ఎస్ఐ కారును అక్కడే వదిలి వెళ్లిపోయినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.ఎస్ఐ స్వగ్రామం హల్దీపూర్ మండలం వేంపల్లి గ్రామంగా స్థానికలు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన సుమారు 50 మందికిపై గా పోలీసులపై ఆ శాఖ చర్యలు తీసుకొంది. క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పోలీసుల్లో ఎక్కువ మందిపై లైంగికదాడి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జూలై మాసంలోమారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది.
వివాహితపై కన్నేసిన నాగేశ్వరరావు భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన భర్తను కూడ బెదిరించారు. ఈ నేరానికి పాల్పడిన సీఐ ఇటీవలనే బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చాడు. జైలు నుండి బయటకు వచ్చిన రెండు రోజుల్లోనే ఆయనను సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.సీఐ నాగేశ్వరరావు లాంటి ఘటనలకు పాల్పడిన ఎస్ఐలు కొందరిని సస్పెండ్ చేశారు.