వీళ్లు మందు ప్రియులు కాదు.. మందు దొంగలు (వీడియో)

Published : Jan 16, 2018, 12:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
వీళ్లు మందు ప్రియులు కాదు.. మందు దొంగలు (వీడియో)

సారాంశం

ప్రమాదానికి గురైన కారు కారు నిండా మందు సీసాలు ఎగబడి లిక్కర్ సీసాలు కొట్టేసిన జనాలు

మందు ప్రియులు.. తాగుబోతులు అనగానే మనకు ఏం గుర్తొస్తది... వాళ్లు మందు ఇష్టంగా తాగుతారు గొడవలు చేస్తారు.. హింసకు పాల్పడతారు. ప్రమాదాలకు కారకులవుతారు ఇలాంటివే కదా? మందు ప్రియులు వేరు తాగుబోతులు వేరు అన్న చర్చ కూడా ఉంది. మందు ప్రియులు కేవలం మందు తాగడాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ తాగుబోతులు మాత్రం మందు తాగి నానా హంగామా సృష్టిస్తారు. రణగోణ ధ్వనులు చేస్తారు. గొడవులు పుట్టిస్తారు. అందుకే మందు ప్రియులు, తాగుబోతులను వేర్వేరుగా చూడాలని చెబుతుంటారు. అయితే దీనికి కొలమానం అంటూ ఏం లేదు. మందు తాగేవాళ్లలో ఎవరు మందు ప్రియులు, ఎవరు తాగుబోతులు అన్నది తేల్చడం కొద్దిగా కష్టమే.

ఈ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి అసలు విషయం చర్చిద్దాం. ఈ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక కారు నిండా ఖరీదైన మందు బాటిళ్లు, వైన్ బాటిళ్లు నింపుకుని ప్రయాణిస్తున్నారు. ఆ కారు యాక్సిడెంట్ కారణంగా రోడ్డు పక్కన పడిపోయింది. కారు కొద్దిగా ధ్వంసమైంది. ఆ కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియరాలేదు. కానీ.. స్థానికులు కారులో ఉన్న మందు సీసాలు, వైన్ బాటిళ్లు కొట్టేస్తున్నారు. ఒక్కొక్కరు ఎగబడి వాటిని కొల్లగొడుతున్నారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న వ్యక్తి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక్కడి వాళ్లు మందు ప్రియులా? తాగుబోతులా అన్నది పక్కనపెడితే వీళ్లు మందు దొంగలుగా మిగిలిపోయారు. అయితే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దావత్ కోసం కారు నిండా మందు సీసాలు పెట్టుకుని ఎక్కడో పార్టీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు చూస్తే తెలుస్తోంది. ఈ ఘటన ఉత్తరభారత దేశంలో జరిగింది. అయితే సోషల్ మీడియా ద్వారా దేశమంతా పాకింది. అయితే ఈ మందు సీసాల దోపిడీపై మరిన్ని వివరాలు అందుబాటులోకి రాలేదు. మీరూ చూడండి మందు దొంగలేం చేస్తున్నారో..?

PREV
click me!

Recommended Stories

Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్ టూ ముంబై 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ! ఇక విమానం ఎక్కాల్సిన అవసరం లేదు!
B.Shivadhar Reddy Given Grand Farewell తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఘనంగా పదవి విరమణ| Asianet Telugu