ప్రేమలో విఫలం, బలవన్మరణం.. కుళ్లిన స్థితిలో జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం..!

Published : Sep 30, 2021, 07:28 AM IST
ప్రేమలో విఫలం, బలవన్మరణం.. కుళ్లిన స్థితిలో జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం..!

సారాంశం

బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా  ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది.  

కుళ్లిన స్థితిలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతదేహం లభ్యమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కుత్బల్లాపూర్ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) మూడు నెలలుగా కిరణ్ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్ లోని గానిజైల్ సింగ్ నగర్ లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని గదిలో నివసిస్తోంది.

కాగా.. ఆమె గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి ఈ విషయాన్ని యజమాని దృష్టికి తీసుకువెళ్లారు. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా  ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది.

కిరణ్ తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతనితో కలిసి నివసిస్తోందని కుటుంబసభ్యులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే.. కిరణ్ ఆమెను మెసం చేశాడు. ఆమెకు తెలీయకుండా మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఈ విషయం తెలుసుకొని తీవ్ర మనస్థాపానికి గుురైన అనురాధ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026