ఈ దొంగ భలే చిలిపి... దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి, పోలీసు పర్సునే కొట్టేశాడు...

By SumaBala BukkaFirst Published Dec 20, 2021, 3:01 PM IST
Highlights

అర్థరాత్రి తర్వాత పోలీసులు నిద్రిస్తున్న సమయంలో thief వారి కళ్లు గప్పి చాకచక్యంగా పరారయ్యాడు. పారిపోతూ పారిపోతే.. దొంగ బుద్దిని వదలలేదు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ల పర్సులు, సెల్ ఫోన్స్ సైతం ఎత్తుకెళ్లడం గమనార్హం. కాగా, దొంగకోసం మట్టెవాడ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిసింది. 

వరంగల్ : వరంగల్ లో ఓ కిలాడీ దొంగ ఏకంగా police పర్సునే కొట్టేశాడు. అదీ పోలీస్ స్టేషన్ లోనే. వివరాల్లోకి వెడితే..  వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉన్న దొంగ పోలీసుల కళ్లు కప్పి పరారైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఇటీవల ఓ దొంగతనం కేసులో నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి Mattewada Police Station లో కస్టడీకి అప్పగించారు. 

అర్థరాత్రి తర్వాత పోలీసులు నిద్రిస్తున్న సమయంలో thief వారి కళ్లు గప్పి చాకచక్యంగా పరారయ్యాడు. పారిపోతూ పారిపోతే.. దొంగ బుద్దిని వదలలేదు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ల పర్సులు, సెల్ ఫోన్స్ సైతం ఎత్తుకెళ్లడం గమనార్హం. కాగా, దొంగకోసం మట్టెవాడ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిసింది. 

ఇక ఇలాంటిదే మరో ఘటనలో.. బాలుడిపై చోరీ కేసు నమోదయ్యింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ లో కాసం నవీన్ ఇంట్లో బంగారు ఉంగరం దొంగిలించిన అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ నాయక్ ఆదివారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం సదరు బాలుడు అదే గ్రామానికి చెందిన నవీన్ ఇంట్లో దూరి బీరువాలో నుంచి ఉంగరం చోరీ చేసి వెల్తుండగా స్థానికులు గుర్తించాడు. 

సూర్య ‘గ్యాంగ్’ సినిమా తరహాలో దొంగతనం.. సీబీఐ పేరుతో బంగారం, వజ్రాలు, నగదుతో పరారీ..

ఆదివారం ఉదయం గ్రామ పెద్దలు బాలుడిని పిలిపించగా నేరం ఒప్పుకుని చోరీ చేసిన ఉంగరం అప్పగించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

ఇదిలా ఉండగా, పోలీసులు ఎంతగా నిఘా పెట్టి కఠిన చర్యలు చేపడుతున్నా.. కొందరు కిలాడీలు అమాయకులకు టోకరా వేసి లక్షలు కొట్టేస్తున్నారు. డిసెంబర్ పదకొండో తారీఖున కర్నూలు జిల్లాలో ఓ ఘరానా మోసం బయటపడింది. వ్యాక్సిన్ వేస్తానని ఇంట్లోకి ప్రవేశించిన మాయలేడీ ఏకంగా బంగారు చైన్‌తో పరారైంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నగరంలోని స్టాంటన్‌పురంలో కళావతమ్మ అనే మహిళ ఇంటికి ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తానని నమ్మించింది.

ఆందోళ చేస్తున్న రైతులను కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది: కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ హరీష్ రావు

వ్యాక్సిన్‌ వేసే ముందుగా కళ్లలో రెండు చుక్కలు మందు వేసుకోవాలని నమ్మబలికింది. దీనికి బాధితురాలు సమ్మతించడంతో కళ్లలో చుక్కలు వేసింది. ఇదే అదునుగా భావించిన నిందితురాలు.. కళావతమ్మ మెడలోని 25 గ్రాముల బరువున్న బంగారు గొలుసును తెంపుకుని ఉడాయించింది. బాధితురాలు గట్టిగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చి ఆమె కోసం వెతికింది. దీంతో అర్బన్‌ తాలూకా పోలీసు స్టేషన్‌ చేరుకుని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

click me!