TRS Protest: ఈటల ఇలాకాలో టీఆర్ఎస్, బిజెపి శ్రేణుల బాహాబాహీ... జమ్మికుంటలో ఉద్రిక్తత (Video)

By Arun Kumar PFirst Published Dec 20, 2021, 2:13 PM IST
Highlights

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనాన్ని బిజెపి శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు పార్టీల నాయకులు బాహీబాహీకి దిగారు,  

కరీంనగర్: తెలంగాణ రైతాంగం నుండి ధాన్యం కొనుగోలు (paddy procurement) చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అధికార టీఆర్ఎస్ ఆందోళన (trs protest) కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన చావు డప్పుతో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నాయి. ఇలా కరీంనగర్ జిల్లా (karimnagar district)లోని హుజురాబాద్ (huzurabad) నియోజకవర్గం జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. 

జమ్మికుంట (jammikunta)లోని గాంధీ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) దిష్టిబొమ్మ దహనానికి టీఆర్ఎస్ నాయకులు యత్నించారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న బిజెపి (BJP) నాయకులు దీన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బిజెపి, టీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపైకి ఒకరు దూసుకువెళ్లడంతో తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది.   

Video

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాహాబాహీకి సిద్దమైన ఇరు పార్టీల నాయకులను అక్కడినుండి చెదరగొట్టారు. పలువురు బిజెపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేవలం బిజెపి నాయకులను మాత్రమే అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అదుపులోకి తీసుకున్న నాయకులను విడిపచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

Video  గ్రామ గ్రామాన చావుడప్పుతో టీఆర్ఎస్ నిరసన... నిర్మల్, మహబూబాబాద్ లో మంత్రుల నిరసన 

ఇదిలావుంటే అదిష్టానం పిలుపుతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనబాట పట్టారు. బిజెపి, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలకు చావుడప్పుతో శవయాత్ర నిర్వహిస్తున్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి ఇప్పటికే సేకరించిన, ఇకపై సేకరించనున్న మొత్తం ధాన్యాన్ని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

 కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్   జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో నిరసన కార్యక్రమంలో  భాగంగా చేపట్టిన ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

 మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టిన మంత్రి రోడ్డుపై బైఠాయించారు. కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేసారు. 

Read More  వ‌రి ధాన్యం కొనాల‌ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళ‌న‌లు

రంగారెడ్డి జిల్లా షాబాద్ లో జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి నాయకత్వంలో ముంబై బెంగళూరు హైవే పై నిర్వహించిన నిరసన ధర్నాలో ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. చావుడప్పుతో భారీ ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు. 

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వ లేక పోతున్నా బిజెపి కనీసం రైతులకు న్యాయం చేయాలని మహేందర్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని విమర్శించారు.పంజాబ్ ధాన్యం పూర్తిగా కొన్న తరహాలోనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ సమాఖ్య స్ఫూర్తి కి కేంద్రం విఘాతం కల్పిస్తుందని మహేందర్ రెడ్డి మండిపడ్డారు.


 


 

click me!