కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్ల సంస్థలకు కొమ్ము కాస్తుందని మంత్రి హరీష్ రావు (minister harish rao) ఆరోపించారు. రైతులుఆందోళన చేస్తే కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతు నష్టపోవద్దనే యాసంగిలో వరి వేయద్దని కేసీఆర్ (kcr) చెప్పారని తెలిపారు.
వడ్లు కొనకుండ చేతులు ఎత్తేసిన బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మంత్రి హరీష్ రావు (minister harish rao) తెలంగాణ రైతులకు పిలుపునిచ్చారు. రైతు నష్టపోవద్దనే యాసంగిలో వరి వేయద్దని కేసీఆర్ చెప్పారని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. గజ్వేల్ నియోజవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ చేసిన మోసాన్ని, దగాను రైతులకు వివరించాలని టీఆర్‌ఎస్ శ్రేణులను కోరారు. కిషన్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే.. యాసంగిలో కేంద్రం వడ్లు కొంటుందా..? లేదా..? చెప్పాలని డిమాండ్ చేశారు. సొల్లు మాటలు చెప్పకుండా.. కేంద్రం చేత వడ్లు కొనిపించాలని కోరారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు.
బీజేపీ కార్పొరేటర్ల సంస్థలకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. రైతులుఆందోళన చేస్తే కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ.. రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం.. పంటలు కొనాల్సిన డ్యూటీ కేంద్రానికి ఇచ్చారని, పంటలు పండించే డ్యూటీ రాష్ట్రాలకు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణలో 24 గంటల వచ్చిందన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతులకు కరెంట్ ఇచ్చామని అన్నారు. రైతులు కరెంట్, నీళ్లు ఇచ్చి పంటలు పండించేలా చేశారు. కానీ బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి అసలు విషయం మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
undefined
Also read: రెండు రోజులుగా ఆయన కోసం వెయిటింగ్... అయినా దక్కని అపాయింట్ మెంట్: నిరంజన్ రెడ్డి సీరియస్
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యాంక్‌లకు పోతే అప్పు పుట్టేది కాదు. కానీ సీఎం కేసీఆర్.. రైతు బంధు కింద ఏడాదికి రూ. 10 వేలు పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ధరణిని తెచ్చి రైతులను కాపాడుకుంటున్నారు. రైతులు చనిపోతే రూ. 5 లక్షల బీమా ఇస్తున్నాం. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్లు నీటి ప్రాజెక్టుల మీద ఖర్చు చేసింది. ఆహార భద్రత అనేది కేంద్ర ప్రభుత్వ పని అన్నారు. ఇన్నేళ్లుగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేశాయి. కానీ కొత్తగా మోదీ ప్రభుత్వం వడ్లను కొనమని మొండికేస్తుంది. ఇన్నేళ్లుగా చేసిన పనిని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు..?’ అని హరీష్ రావు ప్రశ్నించారు.