ఆ అమ్మవాారే దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది... ఎలాగో మీరే చూడండి?

By Arun Kumar PFirst Published Apr 3, 2024, 6:17 PM IST
Highlights

ఆ అమ్మవాారే ఇంటిదొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తన సొత్తును కాజేయాలని చూసిన దొంగను రాత్రంతా కదలనివ్వకుండా చేసి గ్రామస్తులకు పట్టించారు అమ్మవారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. 

కామారెడ్డి : ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనేది సామెత. కానీ తన భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో సమర్పించిన డబ్బులను దొంగిలిస్తుంటే ఆ దైవం చూస్తూ ఊరుకోలేదు. తన సన్నిధిలో పనిచేసే ఇంటిదొంగను ఆ దేవుడు అడ్డంగా బుక్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఏకంగా దేవుడి హుండీలో డబ్బులు దొంగిలేంచేందుకు ప్రయత్నించిన దొంగ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో గ్రామదేవత ఆలయం వుంది. మాసుపల్లి పోచమ్మకు గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పూజలు చేసి కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా భక్తులు అమ్మవారికి సమర్పించే డబ్బులపై అదే ఆలయంలో పనిచేసే సురేష్ కన్నుపడింది. దీంతో నిత్యం సేవచేసే ఆలయంలోనే  దొంగతనానికి యత్నించి అమ్మవారి ఆగ్రహానికి గురయ్యాడు.  

అమ్మవారి సన్నిధిలోని హుండీలో డబ్బులు దొంగిలించేందుకు సురేష్ ప్రయత్నించాడు. కానీ అతడి చేయి హుండీలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా హుండీలోంచి చేయి బయటకు రాలేదు. దీంతో రాత్రంతా అలాగే లాక్కోలేక పీక్కోలేక నరకం చూసాడు. ఉదయం గ్రామస్తులు ఆలయానికి వచ్చేసరికి సురేష్ హుండీలో చేయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వెంటనే గ్రామపెద్దలు పోలీసులకు సమాచారం అందించారు. 

 వెంటనే బిక్కనూరు పోలీసులు రామేశ్వరపల్లి పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. హుండీలోంచి సురేష్ చేయిని బయటకు తీయించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమ్మవారే తన సొమ్మును కాపాడుకుందని... ఇంటిదొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందని గ్రామస్తులు అంటున్నారు. దేవుడితో పెట్టుకుంటే ఇలాగే వుంటుందని గ్రామపెద్దలు హెచ్చరిస్తున్నారు. 

అయితే దొంగ చేయి హుండీలో ఇరుక్కుపోయిన వీడియో బయటకు వచ్చింది. దీంతో ఈ దొంగపై కొందరు సీరియస్ గా, మరికొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఎలాగైతేనేం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన చెయ్యి..

బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండి పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలో ఇరుక్కుపోయింది.

ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి… pic.twitter.com/CtLrzQqiM6

— Telugu Scribe (@TeluguScribe)

 

click me!