
వికారాబాద్‌లో (vikarabad) పోలీస్ కస్టడీ నుంచి ఓ అంతర్రాష్ట్ర దొంగ పరారయ్యాడు. దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ క్రమంలో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ (shankarpally police station) నుంచి వారిని తరలిస్తుండగా వాష్ రూమ్ అంటూ పరారయ్యాడు ఏ1 నిందితుడు మహమ్మద్ (mohammed). ఇతని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. రాత్రి వేళ ఒంటరిగా వెళ్లేవారిని టార్గెట్ చేసి వారిపై దాడికి పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిన్న అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.
గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి, చేవెళ్ల, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి దోపిడీలకు పాల్పడుతోంది ఈ ముఠా. అగంతకుల దాడితో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ (cyberabad police commissioner) , స్టీఫెన్ రవీంద్ర (stephen ravindra) స్పందించారు. వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో ఏ1 నిందితుడు మహ్మద్ పరార్ కావడం కలకలం రేపుతోంది.