కరీంనగర్ పోలీసుల వినూత్న ప్రయత్నం...సాంకేతికత సాయంతో కరోనా కట్టడి

By Arun Kumar PFirst Published Apr 28, 2020, 12:02 PM IST
Highlights

కరోనాా మహమ్మారిని తమ జిల్లా నుండి  తరిమికొట్టేందుకు కరీంనగర్ పోలీసులు అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. 

కరీంనగర్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ముందస్తుగానే నియంత్రణ చర్యలు చేపడుతున్న కరీంనగర్ పోలీసులు అందుకోసం వినూత్నరీతిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యల్లో భాగంగా అదనంగా థర్మల్ స్కానర్లతో స్క్రీనింగ్ టెస్ట్ లను కొనసాగిస్తున్న కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు తాజాగా వైద్య,ఆరోగ్య శాఖ అధికారుల సహకారంతో పల్స్ ఆక్సీమీటర్ల వినియోగాన్ని ప్రారంభించారు. 

ఇప్పటివరకు లాక్ డౌన్, కర్ఫ్యూ లను పగడ్భందీగా నిర్వహిస్తూనే మరోపక్క థర్మల్ స్కానర్లతో స్క్రీనింగ్ టెస్ట్ లను నిర్వహించిన పోలీసులు మరో అడుగు ముందేకేసీ ఫల్స్ ఆక్సీమీటర్లను వినియోగిస్తున్నారు. థర్మల్ స్కానర్ల ద్వారా వ్యక్తి  శరీర ఉష్ణోగ్రతను పరిశీలించడం.... ఏవైనా లక్షణాలు కలిగిఉన్నట్లైతే ఆసుపత్రులకు తరలించేవారు.  

తాజాగా ఈ పల్స్ ఆక్సీమీటర్ల ద్వారా ప్రజల గుండెచప్పుడు(హాట్ బీట్), పల్స్ రేట్ ను గుర్తించే అవకాశం వుంటుంది. దీంతో కరోనా లక్షణాలున్న వారిని మరింత సులభంగా గుర్తించే అవకాశం వుంటుంది. ఇలా థర్మల్ స్కానర్లు, ఫల్స్ ఆక్సీమీటర్లను వినియోగిస్తూ కరోనాను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు కరీంనగర్ పోలీసులు. కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యల్లో తాము లాక్ డౌన్,కర్ప్యూ విధులకు మాత్రమే పరిమితం కాదని ఇతరశాఖలకు చెందిన అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ తమవంతుపాత్రను చురుకుగా పోషిస్తామంటూ కరీంనగర్ పోలీసులు నిరూపిస్తున్నారు. 

బందోబస్తులో ఉన్న పోలీసులకు బిస్కెట్ల వంపిణి

లాక్ డౌన్, కర్ఫ్యూల సందర్భంగా రేయింబవళ్ళు అలు పెరుగకుండా విధులను నిర్వహిస్తున్న పోలీసులకు వివిధ రకాలకు చెందిన బిస్కెట్లను పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అందజేశారు. బందోబస్తు విధుల్లో ఉన్న వివిధ విభాగాలకు చెందిన అన్ని స్థాయిలకు చెందిన 600మంది పోలీసులకు ఈ బిస్కెట్లను అందజేయనున్నామని చెప్పారు. కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తున్న పోలీసుల వద్దకు వెళ్లి ఈ బిస్కెట్లను అందించారు సిపి. 

దాదాపు 20వేల రూపాయల విలువచేసే వివిధ రకాల బిస్కెట్లను పోలీసులకు అందజేసేందుకు ముందుకువచ్చిన కిరాణం దుకాణాల వ్యాపారులను పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసిపి అశోక్, ట్రైనీ ఐపిఎస్ అధికారిణి నిటికపంత్, ఇన్స్ పెక్టర్లు  విజయ్ కుమార్, దేవారెడ్డి, ప్రకాశ్, శశిధర్ రెడ్డిలతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన పోలీసులు పాల్గొన్నారు.

click me!