Hyderabad: ప్రతిపక్షాల 'ఇండియా' కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానం అందకపోవడంపై తాను పట్టించుకోవడం లేదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు. ఇదే సమయంలో థర్డ్ ఫ్రంట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. థర్డ్ ఫ్రంట్ కు అవకాశముందనీ, దీనికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వం వహిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
AIMIM chief Asaduddin Owaisi: ప్రతిపక్షాల ఇండియా కూటమిలో చేరాల్సిందిగా తనకు ఆహ్వానం అందకపోవడంపై తాను పట్టించుకోవడం లేదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు. ఇదే సమయంలో థర్డ్ ఫ్రంట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. థర్డ్ ఫ్రంట్ కు అవకాశముందనీ, దీనికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వం వహిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
వివరాల్లోకెళ్తే.. థర్డ్ ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోరారు. దీనిని ఆయన నాయకత్వం వహించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. "థర్డ్ ఫ్రంట్ కు అవకాశం ఉందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలు ప్రతిపక్ష కూటమి ఇండియాలో లేరు. సహేతుకమైన ఉనికి ఉన్న పార్టీలు కూడా ఎన్డీయే, ఐఎన్డీ కూటమిలో లేవు. కాబట్టి, కేసీఆర్ చొరవ తీసుకొని తేడాను చూస్తారని నేను ఆశిస్తున్నాను" అని ఒవైసీ అన్నారు. అలాగే, కేసీఆర్ నాయకత్వం వహిస్తే రాజకీయ శూన్యత భర్తీ అవుతుందనీ, ఇండియా కూటమి ఈ శూన్యతను పూరించలేకపోయిందని కూడా అన్నారు. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా తనకు ఆహ్వానం అందకపోవడంపై తాను పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు.
| On not being invited to join the INDIA alliance, AIMIM chief Asaduddin Owaisi says "I don't care about not being invited. BSP chief Mayawati, Telangana CM K Chandrashekar Rao, and several parties from Northeast and Maharashtra are also not members of this alliance...We… pic.twitter.com/wVbZjgoY95
— ANI (@ANI)ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం గురించి ఓవైసీ మాట్లాడుతూ.. "దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లకు రిజర్వేషన్లు పెంచాలని సీడబ్ల్యూసీ సిఫారసు చేసింది. మరి ముస్లింల సంగతేంటి? మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఈ విషయాన్ని పార్లమెంటులో నేను పలుమార్లు చెప్పానని" పేర్కొన్నారు. మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కపటత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించిన ఒవైసీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్ గఢ్ లలో వారికి ఏం చేసిందని ప్రశ్నించారు. హర్యానాలో జునైద్, నాసిర్ సజీవదహనం అయినప్పుడు వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. కన్హయ్య లాల్ ను ఉగ్రవాదులు (రాజస్థాన్ లో) హతమార్చినప్పుడు ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వడంలో కాంగ్రెస్ వివక్ష చూపుతోందన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించబోయే ఎన్నికల ఫలితాలను ఎంఐఎం అధినేత తోసిపుచ్చారు. కర్ణాటకలో బీజేపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయనీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. "తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ లు ధరించి కాలేజీలకు వెళ్లలేని పరిస్థితులు లేవు. ఇక్కడ ముస్లింలను చంపడం లేదు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చక్కగా నిర్వహించబడుతుంది. ఇది తెలంగాణ, కర్ణాటక కాదు.. అని అన్నారు. అనంత్ నాగ్ లో ఐదో రోజు కూడా కాల్పులు కొనసాగుతున్న తరుణంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య జరగబోయే ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ గురించి ప్రశ్నించగా, అధికారంలో ఉన్న బీజేపీ మౌనంగా ఉందని ఒవైసీ విమర్శించారు.