హీరో బాలకృష్ణ ఇంట్లో చోరీకి ప్లాన్.. పాపులర్ అవుదామని

Published : Sep 28, 2018, 10:11 AM IST
హీరో బాలకృష్ణ ఇంట్లో చోరీకి ప్లాన్.. పాపులర్ అవుదామని

సారాంశం

 జూబ్లీహిల్స్‌లో నివసించే సినీ హీరో నంద మూరి బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు సతీష్‌ బెంగళూ రు పోలీసుల విచారణలో వెల్లడించాడు.

హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ఇంట్లో  చోరీకి ప్లాన్ చేసిన ఓ నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఇది కాక పలువురి ఇళ్లల్లో చోరీలకు పాల్పడి.. కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సత్తిబాబు అలియాస్ బుజ్జి.. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 9న బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్‌ డీజీ శ్రీనివాసులు, అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి యత్నించాడు. అక్కడ విలువైన వస్తువులు దొరక్కపోవడంతో కారు తాళం చెవులు దొంగిలించి పార్కింగ్‌ చేసి ఉన్న కారుతో ఉడాయించాడు. అనంతరం కారు నంబర్‌ తొలగించి బోగస్‌ నంబర్‌ ప్లేట్‌ తగిలించాడు. 

ఈ నెల 18న సదాశివనగర్‌లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు. ఇంట్లో ఆయన సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు. గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్‌ పెట్రోలింగ్‌ పోలీసులు అతడిని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా ముసుగు ధరించిన దొంగ కనిపించాడు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు తప్పించుకొని పారిపోతున్న సతీష్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

పోలీసు  విచారణలో గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లలో 12 దొంగ తనాలు చేసినట్లు నిర్ధారణ అయింది. గత నెలలోనే ఎమ్మెల్యే కాలనీలో నాలుగు దొంగతనాలు చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  మరింత సమాచారం రాబట్టేందుకు బెంగళూరు పోలీసులు గురువారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.

తనకు జూబ్లీహిల్స్‌లో నివసించే సినీ హీరో నంద మూరి బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు సతీష్‌ బెంగళూ రు పోలీసుల విచారణలో వెల్లడించాడు. బాల కృష్ణ ఇంట్లో దొంగతనం చేస్తే పాపులర్‌ అవుతాన ని చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. ఒకవేళ బెంగళూరు పోలీసులకు దొరికి ఉండకపోతే వచ్చే నెలలో సతీష్‌ మళ్లీ జూబ్లీహిల్స్‌పై కన్నేసేవాడని ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ ఇంట్లో చోరీకి యత్నించేవాడని పోలీసులు పేర్కొన్నారు

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?