కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. టీచర్ల ‘‘టచ్’’ ప్రొగ్రామ్‌తో వెలుగులోకి దారుణం

By sivanagaprasad kodatiFirst Published Sep 28, 2018, 8:32 AM IST
Highlights

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారులు, మహిళలపై లైంగిక చర్యలను నివారించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు స్పర్శపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల చిన్నారి తన తండ్రి సంవత్సరకాలంగా తనను ఎలా తాకుతున్నాడో... ఏం చేస్తున్నాడో వివరించింది. దీనిని అర్థం చేసుకున్న నిర్వాహకులు వెంటనే చైల్డ్ వెల్ఫేర్ ఛైర్‌పర్సన్‌ పద్మావతికి సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. 12 ఏళ్ల క్రితం వివాహమైన నిందితుడికి భార్యతో పాటు.. 11, 4 ఏళ్ల ఇద్దరు కూతుళ్లు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. భార్య మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో పెద్ద కూతురితో తన కోరిక తీర్చుకోవాలని భావించి.. సంవత్సర కాలగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 
 
click me!