ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. థియేటర్ ఆపరేటర్ ఆత్మహత్య

Published : Sep 12, 2020, 02:10 PM IST
ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. థియేటర్ ఆపరేటర్ ఆత్మహత్య

సారాంశం

అంతేకాకుండా వచ్చే నెల నుంచి జీతం ఇవ్వటం కుదరదని చెప్పటంతో మనోవేదనకు గురైన ఆయన నివాసంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐమాక్స్‌ సినిమా థియేటర్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖైరతాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖైరతాబాద్‌కు చెందిన భాస్కర్‌(52) అనే వ్యక్తి ఐమాక్స్‌ సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఐమాక్స్‌ థియేటర్‌ యాజమాన్యం సగం జీతం మాత్రమే ఇచ్చింది.

అంతేకాకుండా వచ్చే నెల నుంచి జీతం ఇవ్వటం కుదరదని చెప్పటంతో మనోవేదనకు గురైన ఆయన నివాసంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Kavitha Pressmeet: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కౌంటర్| Asianet News Telugu
KTR Comments: మేము తిడితే మీ జేజమ్మలకు దిమ్మ తిరుగుద్ది: కేటిఆర్ సెటైర్లు | Asianet News Telugu