చిన్నజీయర్ స్వామికి మాతృవియోగం, ప్రారంభమైన అంత్యక్రియలు

By team teluguFirst Published Sep 12, 2020, 12:00 PM IST
Highlights

చిన్న జీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) నిన్న రాత్రి 10 గంటలకు మృతి చెందారు.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చిన్నజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లోని ఆయన ఇంట్లో చిన్న జీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) నిన్న రాత్రి 10 గంటలకు మృతి చెందారు.

ఇందాక ఉదయం 10:30 గంటలకు ముచ్చింతల్ లోని ఆశ్రమంలోనే ఆమె  అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆయన తల్లి మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశంలోని అనేక మంది ప్రముఖులు చిన్న జీయర్ స్వామి ఆశిస్సుల కోసం ఆయన ఆశ్రమానికి రావడం మనం చాలాసార్లు చూసాము. 

గతంలో ఆశ్రమంలో తీరు నక్షత్ర వేడుకలకు హాజరైన.... ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ. తమ కుటుంబం శ్రీవైష్ణవ సాంప్రదాయంలోనే పూజలు నిర్వహిస్తూ వస్తోందన్నారు. తమ బాల్యంలో గురువులు ఇళ్లకి వచ్చి రామాయణ, భారత, భాగవతాలు బోధించి నెల రోజులు తమ ఇంటిలోనే ఉండేవారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 

చిన్న జీయర్ స్వామితో తనకు 1986 నుంచి పరిచయం వుందని.. ఆ సమయంలో సిద్ధిపేటలో నిర్వహించిన బ్రహ్మాయజ్ఞానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుంచి చేశానని సీఎం వెల్లడించారు. యజ్ఞం జరిగినన్ని రోజులు చిన్నజీయర్ తమ ఇంట్లోనే ఉన్నారని..తాను ఆయనకి కారు డ్రైవర్‌గా మారిపోయానని కేసీఆర్ అప్పట్లో తెలిపారు. 

యాగం మధ్యలో కానీ.. చివర్లో కానీ వర్షం పడుతుందని చినజీయర్ స్వామి చెప్పారని అలాగే జరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. హైందవ మతానికి, సాంప్రదాయలకు ఎటువంటి ఢోకా ఉండదని కేసీఆర్ ఆకాంక్షించారు.

2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కూడా వచ్చి చినన్ జీయర్ స్వామి ఆశిస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. 

click me!