
మన శరీరానికి గాయాలైతే ఏలాంటి శబ్దమూ చేయకున్నా తగ్గిపోతాయి అని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కానీ దేశానికైన గాయాలు మౌనంగా ఉంటే అవి తగ్గిపోవని, చివరికి అవి రాచపుండుగా మారి బాధపెడుతాయని తెలిపారు. ప్రస్తుతం అందరం అలాంటి పరిస్థితిలోనే ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.
వివాహమైన మాజీ ప్రియుడి కిడ్నాప్.. బలవంతంగా అతడిని మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ ప్రియురాలు..
హైదరాబాద్ ని బాగ్ లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సమూహ’ అనే సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభకు ప్రకాశ్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సభకు అధ్యక్షత వహించి ఆ ఫోరం లోగోను ఆయన ఆవిష్కరించారు. మనం పయణిస్తున్న తోవలో రక్తం ఉంటే దానిపై రచయితలు, కవులు తమ గళం విప్పాలని కోరారు.
తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ప్రస్తుత సమాజంలో పరిణామాలను చూసుకుంటూ తాను ఊరికే కూర్చొని ఉండలేనని తెలిపారు. ఎన్నో రోజులుగా మణిపూర్ రగిలిపోతోందని, హింస చెలరేగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపాల్సిన నాయకులు.. పార్లమెంట్ లో 10 రోజుల పాటు ఏం చేశారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. చట్ట సభల్లో రాజకీయాలు చేశారే తప్ప సమస్యకు ఒక పరిష్కారం తీసుకురాలేదని అన్నారు.
newsclick : న్యూస్‌క్లిక్‌కు షాక్.. ట్విట్టర్ ఖాతా సస్పెండ్
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. జోకర్ ను నాయకుడిగా ఎన్నుకుంటే ప్రజలందరూ ఇలాంటి సర్కస్ లనే చూడాల్సి ఉంటుందని తెలిపారు.