
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీ, 20వ తేదీల్లో రెండు జిల్లాలు మెదక్, సూర్యపేటలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
19వ తేదీన సీఎం కేసీఆర్ మెదక్‌లో పర్యటించనున్నారు. అక్కడ సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమల అనంతరం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Also Read: TSPSC: గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష నవంబర్‌కు వాయిదా
ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ సూర్యపేట జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జిల్లాలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఇదిలా ఉండగా, గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడానికి టీఎస్‌పీఎస్సీని సంప్రదించాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు కేటీఆర్ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఈ పరీక్ష వాయిదా వేయాలని సూచించినట్టు వివరించారు. అంతేకాదు, భవిష్యత్‌లోనూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు జారీ చేసేటప్పుడు ఒకేసారీ అన్నింటినీ విడుదల చేయకుండా తగిన వ్యవధి ఇస్తూ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధులు కావడానికి తగిన సమయం ఉండేలా చూసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి సీఎం కేసీఆర్ సూచనలు చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.