
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. గత గురువారం ఈ ఉప ఎన్నిక పూర్తి కాగా ఆదివారం ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. నల్గొండ జిల్లా అర్జాలబావిలో ఈ ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది.
తమిళనాడులో వర్ష బీభత్సం.. వానల ప్రభావంతో మరో ముగ్గురు మృతి.. 26కు చేరిన మరణాలు..
ఈ ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వారికి సంబంధించిన ఏజెంట్లకు కౌంటింగ్ కేంద్రంలో బస చేసేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అలాగే కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఘటనలూ చెలరేగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వలు ఉంటారు.
మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆగస్టులో బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గురువారం హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికలు సాగాయి. ఇందులో 93.13 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు రాగా, 2,25,192 మంది వ్యక్తులు వ్యక్తిగతంగా ఓటు వేశారు. చివరి ఘడియల్లో పలు పోలింగ్ కేంద్రాల్లోకి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ క్యూలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కొన్ని బూత్‌లలో రాత్రి 10.30 గంటల వరకు ప్రక్రియ కొనసాగింది.
మునుగోడు ఉపఎన్నిక రద్దు చేయండి.. కౌంటింగ్‌కు ముందు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలనం
ఎన్నికల బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే సాగింది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ టికెట్ పై పోటీ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెడ్డిని బరిలోకి దింపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ పోటీలో నిలిపింది.
రాజీనామా చేయండి .. రోడ్లు పడతాయి : రసమయి బాలకిషన్‌కి నిరసన సెగ
మూడు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. ఓటర్లను తమ వైపునకు ఆకర్శించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. దీంతో ఈ ఎన్నికలు రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్శించాయి. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయత్రం వరకు అధికారికంగా వెల్లడికానున్నాయి. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతారు.