కేసీఆర్ ముందస్తు ప్లాన్: కారణాలు ఇవే, కేటీఆర్ కోసం...

By pratap reddyFirst Published Sep 7, 2018, 10:34 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెనక పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు.  

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెనక పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు.  జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ లోకసభ ఎన్నికలపై పూర్తి స్థాయి శక్తిసామర్థ్యాలను పెట్టడానికి వెసులుబాటు కలుగుతుందనే ఉద్దేశం కూడా కేసిఆర్ కు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన భావిస్తున్నారు. జిఎస్టీ, పెట్రో ధరల పెంపు, తదితర కారణాలతో రాష్ట్రంలో మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అంచనా ఉంది. బిజెపి, టీఆర్ఎస్ దోస్తీ కట్టాయనే అభిప్రాయం ఉంది. దానికి ఇటీవలి పరిణామాలు కూడా దోహదం చేస్తున్నాయి. అందువల్ల బిజెపిపై ఉన్న వ్యతిరేకత శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీపై పడకూడదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడానికి వెసులుబాటును కేసీఆర్ కోరుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే, లోకసభ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు సాధించడానికి వీలవుతుందని, తద్వారా జాతీయ రాజకీయాల్లో కీలకమైన భూమికను పోషించడానికి అవకాశం అంది వస్తుందని ఆయన అనుకుంటున్నారు. 

తన కుమారుడు కేటి రామారావును ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి తాను జాతీయ రాజకీయాలకు వెళ్లడానికి అవకాశం కలుగుతుందని కేసిఆర్ భావిస్తున్నట్లు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 

మరో ప్రధానమైన విషయం ఏమిటంటే, ప్రతిపక్షాలు కుదురుకోక ముందే ఎన్నికలకు వెళ్లడం వల్ల తమ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కేసిఆర్ అంచనాగా చెబుతున్నారు. కాంగ్రెసు పొత్తుల చర్చలు కొలిక్కి ప్రతిపక్షాలు ఒక తాటి మీదికి వచ్చి వ్యూహరచన ఖరారు చేసుకోవడానికి వ్యవధి ఇవ్వకూడదనేది ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. 

click me!