అభ్యర్థుల ప్రకటన.. నాయిని కి కోపం

By ramya neerukondaFirst Published Sep 7, 2018, 10:16 AM IST
Highlights

తాను సూచించిన అభ్యర్థికి టికెట్‌ ఇవ్వలేదని  నాయిని  తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్‌ స్థానం నుంచి తన సమీప బంధువు, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన కేసీఆర్‌ నిర్వహించిన విలేకరుల సమావేశానికి సైతం దూరంగా ఉన్నట్లు సమాచారం.

ముందస్తు ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. గురువారం త్వరలో రానున్న ఎన్నికలకు తన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఈ విషయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కోపం వచ్చిందట.

తాను సూచించిన అభ్యర్థికి టికెట్‌ ఇవ్వలేదని  నాయిని  తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్‌ స్థానం నుంచి తన సమీప బంధువు, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన కేసీఆర్‌ నిర్వహించిన విలేకరుల సమావేశానికి సైతం దూరంగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఆ జాబితాలో ముషీరాబాద్‌ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠా గోపాల్‌ పేరు ఉందన్న సమాచారంతో నాయిని అలిగినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరు కాలేదన్న ప్రచారం జరిగింది. దీంతో చివరి నిమిషంలో ముషీరాబాద్‌ అభ్యర్థి ప్రకటనను వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై హోంమంత్రిని  మీడియా ప్రతినిధి అడగ్గా.. కేబినెట్‌ సమావేశంలో తాను పాల్గొనడం వల్లే, కేసీఆర్‌ విలేకరుల సమావేశానికి వెళ్లలేదని, ‘అయినా ముషీరాబాద్‌ టికెట్‌ శ్రీనివాసరెడ్డికి ఎందుకు రాదు... తప్పకుండా వస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

click me!