రహస్యం: రోడ్ గుంతల మీద కెసిఆర్ కు కోపమెందుకు

First Published May 3, 2017, 10:38 AM IST
Highlights

ఖమ్మం నుంచి మిర్చి ఘాటు ఎక్కువయింది. మిర్చి రైతులను జిల్లా మంత్రి  తుమ్మల  మచ్చిక చేసుకోలేక పోయారు. దీంతో కాంగ్రెస్ రెచ్చిపోతూ ఉందని ముఖ్యమంత్రి కి  కోపమట

 రోడ్ల మీద ఉన్నట్లుండి ముఖ్యమంత్రి కెసిఆర్ కు అంత ఆసక్తి ఎలా పెరిగింది?

 

రాష్ట్రంలోరోడ్లన్నీంటిని గుంతలు లేని రోడ్లుగా చేయాలనడం, దానికి కేవలం నెల రోజులే టైం ఇవ్వడం... మెల్లిమెల్లిగా చర్చనీయాంశమయింది. 

 

హైదరాబాద్ నిండా గుంతలే ఉంటే, వరంగల్ నుంచి పాలకుర్తి పోతున్నపుడు గుంతలు కనిపించాయని అనడం ఏమిటీ? ఇపుడు మెల్లి మెల్లిగా దీనికి అర్థం బయటకొస్తూంది.

 

పాలకుర్తి రోడ్డు పై గుంతల మీద కోపం కాదు, ఆ కోపం ఆర్ ఆండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద అనిరాజకీయ వర్గాల్లో వినబడుతూ ఉంది.

 

ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి తుమ్మలని ఆకాశానికి ఎత్తుతూ వచ్చారు. తుమ్మల లాంటి మంత్రి దొరకడం అదృష్టమన్నట్లు  ఐటి మంత్రి కెటి ఆర్ కూడా పొగుడ్తూ వచ్చారు. అంతా బానే ఉంది, కాని ఖమ్మం నుంచి  మిర్చి ఘాటే భరించలేనంతగా రావడం  ముఖ్యమంత్రికి నచ్చలేదు. ఇంత రాజకీయాను భవం ఉన్నమంత్రి మిర్చి రైతులను మచ్చిక చేసుకోలేకపోయాడని ముఖ్యమంత్రి అసంతృప్తి అట. 

 

అయితే,ఇంతవరకుపొగిడి, ఇపుడు మిర్చి ఘాట దగ్గిర తుమ్మలనుతెగడడం బాగుండదు. అందుకని, ముఖ్యమంత్రి రోడ్లమీద గుంతలనుతీసుకుని తుమ్మల మీద బురద చల్లాడని అంతాఅనుకుంటున్నారు.

 

లేకపోతే, నెల రోజుల్లో తెలంగాణాలోని రోడ్లమీద ఉన్నగుంతలను పూడ్చడం సాధ్యమా? కాని, పూడ్చి తీరాల్సిందేనని హకుం జారీ చేయడమే కాకుండా, జూనో ఒకటో తేదీన పర్యటనకొస్తానని, తనిఖీ చేస్తానని, గుంతలు కనపడితేఅక్కడిక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించడం ఏమిటి?

 

గత వారం రోజులు ఖమ్మం సలసల కాగుతూ ఉంది. ఖమ్మం రైతులుదాదాపు తిరుగుబాటు చేశారు. రైతులను అరెస్టు చేశారు. 144 సెక్షన్ పెట్టారు. రైతులను పరామర్శించేందుకు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోతిష్ట వేసింది. ఇదంతా ఏంటి?  ఒక సీనియర్  మంత్రి జిల్లాలో ఇదా పరిస్థితి అని కెసి ఆర్ నారాజయిండట. మిర్చిరైతుల సమస్య ఒక్క తెలంగాణాలో ఉన్నట్లు కాంగ్రెస్ దాడిచేస్తూ ఉండటం ముఖ్యమంత్రికి ఏమాత్రం నచ్చలేదట. ఆంధ్రలోకూడా ఇదేపరిస్థితిఉన్నా అక్కడ రైతులు ఖమ్మంలో లాగా మార్కెట్ యార్డు మీద దాడి చేయలేదుకదా. మంత్రి వైఫల్యం వల్ల కాంగ్రెస్ విజృంభించిందని కెసిఆర్ తెగ ఫీలయి ఇలా తన అసంతృప్తి వెలిగక్కారట.

 

ఈ కోపం ఆయన జిల్లా మంత్రి మీద చూపలేక, ఆయన ఏలుబడిలో ఉన్న గుంతల రోడ్ల మీద కురిపించారని అంటున్నారు.  రోడ్ల మీద ముఖ్యమంత్రి కి ఇలా కోపం రావడమేమిటో అర్థం చేసుకోలేకపోయిన తుమ్మలకు ఎవరో సన్నిహితులు అసలు రహస్యంచెప్పారట. ఇది కాంగ్రెసోళ్లు విజయంగా భావిస్తున్నారు. అయితే,ఈ మధ్య లో దిగ్విజయ్ పిడకల వేట వారికి బొత్తిగా నచ్చడంలేదు.

కెసిఆర్ ఆగ్రహం సబబే అనిపిస్తుంది. తాజాగా టిడిపి నామానాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ ఖమ్మం వెళ్లి ఎలా చేశారు   ఈ వీడియో లో చూశారు గదా?

click me!