కెసిఆర్ ‘రైతే రాజు’ పథకం వెనక ఉన్న ఐఎఎస్ ఆఫీసర్ ఎవరు?

Published : Apr 25, 2017, 06:24 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
కెసిఆర్ ‘రైతే రాజు’ పథకం వెనక ఉన్న ఐఎఎస్ ఆఫీసర్ ఎవరు?

సారాంశం

అధికార వర్గాల గుసగుసల  ప్రకారం ఈ పథకానికి  రూపకల్పన చేసిన వ్యక్తి ఒక ఐఎఎస్ ఆఫీసర్

తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ‘రైతే రాజు’ వినూత్న పథకం ప్రారంభించారు

 ఒక ఏడాదిలో ఈ పథకం అమలులలోకి వస్తుంది. ఈ పథకం కింద ప్రతికుటుంబానికి రెండు  పంటకాలాలలో 8 వేల రుపాయల నగదు అందుతుంది. మొదటి పంటకుఎకరాకు నాలుగువేలు, రెండో పంటకు మరొక నాలుగు వేల చొప్పున, మొత్తం ఎనిమిది వేలు  రైతుఅకౌంటులో జమఅవుతాయి. దీనిని ఎందుకు ఖర్చేచేస్తారో ఎవరూ అడగడరు. రైతు ఇష్టమని కెసిఆర్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం  కనీసం 80 శాతంమందిరైతులకు  ఎనిమిది వేల రుపాయలు చేతికందుతాయి. 2018లో  ఈ డబ్బులు నేరుగా రైతు అకౌంటులో పడతాయి

2018లోనే కేంద్ర రాష్ట్రాలు ఉమ్మడి ఎన్నికలకు పోవడం తర్జన భర్జన జరగుతున్న సమయంలో ఈ పథకం రూపొందుతున్నది.  అంటే ఎకరానికి ఎనిమిది వేలు ఎన్నికలపుడు  అందునున్నాయి.

 

సహజంగా ప్రతి అధికార పార్టీ తన పథకాలను చూపే ఎన్నికలకు వెళ్తుంది. పథకాలనుఓట్లుగా మార్చుకునేందుకు  ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అదే జరగుతుంది.

 

 తెలంగాణాలో కుటుంబానికి సగటున నలుగురు సభ్యలుంటే, ఒక్కొక్కరికి కేవలం ఎకరా భూమే ఉందునుకున్నా, తలా రెండువేల రుపాయలు ఎన్నికల ముందు అందుతాయి.   రెండెకరాలున్న కుటుంబానికి 16 వేల రుపాయలు అంటే  తలా నాలుగు వేల రుపాయలు అందుతాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ పథకం రాలేదు. రుణాల మాఫీ జరిగి ఉండవచ్చు, ఇంతకంటే ఎక్కవ లబ్ది చేకూరి ఉండవచ్చు.  అయితే,  ఒక పథకానికి ఇలా నేరుగా, పెన్షన్ లాగా, రైతు చేతికి నగదు బదిలీకాలేదనే చెప్పాలి. అందునా ఎన్నికల పుడు జరగుతున్నది కాబట్టి, దీనిని ఓట్లలోకి తర్జుమా చేస్తే ఓటరుకు రెండు వేల నుంచి నాలుగు వేల దాకా అందినట్లే లెక్క.

 

ఇంత పకడ్బందీగా ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ పథకం వెనక ఎవరున్నారు? అధికార వర్గాల గుసగుసల  ప్రకారం,  ఈ పథకానికి  రూపకల్పన చేసిన వ్యక్తి ఒక ఐఎఎస్ ఆఫీసర్.

 

ప్రస్తుతం వ్యవసాయం, కోఆపరేటివ్  కార్యదర్శి గా సి. పార్థ సారధి (1993 బ్యాచ్) ఈ రైతే రాజు పథకానికి సరంజామానంతా సమాకూర్చారని చెబుతున్నారు.

 

ముఖ్యమంత్రి ఇలాంటి పథకం యోచిస్తే, దానికి నిధులెలా సమకూర్చాలో, ఎలా అమలుచేయాలో, రైతు సంఘాల ఏర్పాటు, సమాఖ్యల ఏర్పాటు, వ్యవసాయ ఎక్స్ టెన్షన్ అధికారులను రంగంలోకి దించి, నగదును  పకడ్బందీగా ఎక్కడా మధ్య వర్తి అవసరమే లేకుండా   అన్ లైన్ లో రైతుదాకా ట్రాన్స్ ఫర్ కు ప్లాన్ చేసింది పార్థసారిధియేనని చెబుతున్నారు.

 

కరీంనగర్ జిల్లాకు చెందిన పార్థ సారధి పనితీరు భిన్నంగా ఉంటుంది. ఆయన చడీ చప్పుడు లేకుండా సంచలనం సృష్టిస్తుంటారు. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ లో  కూడా ఆయన పనితీరు రాజశేఖర్ రెడ్డి దగ్గరి నుంచి అందరి ముఖ్యమంత్రులందరికి బాగా నచ్చేది. ఇపుడు తెలంగాణాలో కూడా ఆయన టిఆర్ ఎస్ ప్రభుత్వానికి  అతి ముఖ్యమయిన అధికారి. రైతే రాజు ద్వారా  వ్యవసాయ రంగాన్ని రైతు వైపు తిప్పడానికిబాట వేస్తున్నారు. గతంలో కరీంనగర్ కలెక్టర్ పనిచేసినపుడు ఆయనకు చాలా మంచి పేరొచ్చింది. ఇదే విధంగా తెలంగాణాలో సివిల్ సప్లయిస్  కమిషనర్ గా  ప్రశంసలందుకున్నారు.  ఈ రెండు శాఖలలో మొహమాటానికి తావీయని ముఖ్యమంత్రి కెసిఆర్ ను మెప్పించగలగడం విశేషమే.

 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?