ఆదిలాబాద్ లో వికటించిన విందు: నలుగురు మృతి, పలువురు పరిస్థితి విషమం

Published : May 08, 2019, 06:50 PM IST
ఆదిలాబాద్ లో వికటించిన విందు: నలుగురు మృతి, పలువురు పరిస్థితి విషమం

సారాంశం

కొలంగూడ, నార్నూర్, ఉట్నూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు ఇలా నలుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. నలుగురు మరణించడానికి భోజనం వికటించడమే కారణమా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నకోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.   

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లిలో విషాదం నెలకొంది. కొల్లగూడం గ్రామంలో జరిగిన పెళ్లిలో ఏర్పాటు చేసిన విందు వికటించి నలుగురు మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

కొలంగూడ, నార్నూర్, ఉట్నూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు ఇలా నలుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. నలుగురు మరణించడానికి భోజనం వికటించడమే కారణమా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నకోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

మరోవైపు ఐటీడీఏ పీవో, డీఎస్పీలు నార్నూర్ ఆస్పత్రికి చేరుకుని  ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అయితే వివాహం మంగళవారం జరిగిందని తెలుస్తోంది. అయితే నిల్వ ఉంచిన మాంసం తినడం వల్లే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో వైద్యులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు