ఫొని తుఫాన్ ఎఫెక్ట్: ఒడిస్సాకు తెలంగాణ సర్కార్ అరుదైన సాయం

By Nagaraju penumalaFirst Published May 8, 2019, 4:31 PM IST
Highlights

ఒడిశాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం సహాయం కోరింది ఒడిశా ప్రభుత్వం. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయంలో సహకరించాలంటూ కోరింది. దీంతో స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ ఎస్ కే జోషి, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావులతో మాట్లాడారు. 

హైదరాబాద్: ఒడిశా రాష్ట్రాంలో ఫొని తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఫొని తుఫాన్ తీరం దాటి రోజులు గడుస్తున్నా నేటికి కోలుకోలేదు ఒడిశా. తుఫాన్ బీభత్సానికి నేటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లేక అల్లాడుతున్నారు ఒడిస్సా వాసులు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఒడిశాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం సహాయం కోరింది ఒడిశా ప్రభుత్వం. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయంలో సహకరించాలంటూ కోరింది. 

దీంతో స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ ఎస్ కే జోషి, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావులతో మాట్లాడారు. ఒడిశాకు సహకారం అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన 1000 మంది ఉద్యోగులను ఒడిశాకు పంపిచారు. 

ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులు ఒడిశాకు బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయమే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు. 

తుఫాన్ ప్రభావంతో ఒడిశా అల్లకల్లోలంగా మారిందని, విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోయాయని వారు తెలిపారు. విద్యుత్ లైన్లు తెగిపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఒడిశాలో నెలకొన్నాయి. 

ముఖ్యంగా తీర ప్రాంతాల్లో రవాణా, విద్యుత్, తాగునీరు అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం తక్షణ సహాయం కింద నిధులు మంజూరు చెయ్యగా కొన్ని స్వచ్ఛంధ సంస్థలు ఒడిశాను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. అలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను పంపించి వారికి సహాకారం అందించడంతో ఒడిశా ప్రభుత్వ మన్నలను పొందుతుంది. 

click me!