ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. టైరు పేలడంతో చెట్టును ఢీ కొట్టిన వాహనం.. ఉడిపిలో ఘటన

Published : Jun 24, 2023, 01:02 PM IST
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. టైరు పేలడంతో చెట్టును ఢీ కొట్టిన వాహనం.. ఉడిపిలో ఘటన

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో ఆ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపిలో చోటు చేసుకుంది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రమాణిస్తున్న కారు టైరు పేలడంతో, వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపిలో చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్.. ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్ తో బీఆర్ఎస్ ఎంపీల చర్చలు..

వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శనివారం మంగళూరు నుంచి శృంగేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ఉడిపి జిల్లా కర్కల తాలూకాలోని మియారు బ్రిడ్జి సమీపంలోని నల్లూరు క్రాస్ ముడారు ప్రాంతంలోకి చేరుకోగానే టైరు పేలింది. దీంతో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనపై స్థానిక కర్కల పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్