గుండెపోటుతో అల్లాడిపోయినా 45 మందిని కాపాడిన బస్సు డ్రైవర్.. కానీ చివరికి

By team teluguFirst Published Jan 7, 2023, 8:46 AM IST
Highlights

గుండెపోటు ఎంతలా బాధిస్తున్న ఓ డ్రైవర్ తన కర్తవ్యాన్ని మరువలేదు. తనను నమ్ముకున్న ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. బస్సును సురక్షితంగా నిలిపివేశారు. కానీ చివరికి సీటులోనే చనిపోయారు. 

అతడో సీనియర్ డ్రైవర్. వయస్సు 57 సంవత్సరాలు. 45 మంది యాత్రికులతో ఉన్న ఓ బస్సును తీర్థయాత్ర స్థలాలకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. తీవ్రమైన నొప్పితో అవస్థలు పడ్డాడు. అయినా తన కర్తవ్యాన్ని మరువలేదు. తన చేతిలో 45 మంది ప్రాణాలు ఉన్నాయని గుర్తించి ఓపికతో బస్సును సురక్షితంగా ఓ ప్రదేశంలో నిలిపివేశాడు. కానీ చివరికి ఆయన చనిపోయారు.

మద్యం కొనేందుకు అర్హులకే లైసెన్స్ ఇవ్వాలి - తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన

ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా బ్రాహ్మణపల్లికి గ్రామానికి చెందిన 45 మంది తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం బస్సును మాట్లాడుకున్నారు. ఈ బస్సుకు తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లాకు చెందిన 57 ఏళ్ల  జె.దేవాయిరక్కం డ్రైవర్ గా ఉన్నారు. 

బండి సంజయ్‌ని తరలిస్తున్న వాహనంపై రాళ్ల దాడి.. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

ఈ యాత్రికులంతా కొన్ని రోజుల కిందట తమ స్వగ్రామం నుంచి బస్సుల్లో బయలుదేరారు. తమిళనాడులోని పలు ప్రదేశాలు దర్శించుకున్నారు. శుక్రవారం తెలంగాణలోని భద్రాచలంలోని ఆలయాన్ని సందర్శించారు. అనంతరం యాద్రాద్రికి రావాలని నిర్ణయించుకున్నారు. భద్రాచలం-వెంకటాపురం మార్గంలో ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో కొంత దూరం ప్రయాణించిన తరువాత తనకు గుండెల్లో మంట వస్తోందని డ్రైవర్ చెప్పారు. దీంతో కొంత సమయం విరామం తీసుకున్నారు. తరువాత మళ్లీ బస్సును ముందుకు పోనిచ్చారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం .. సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ, అందులో 12 మంది పేర్లు

బస్సు తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం ప్రాంతంలోని అంకన్నగూడెం ప్రాంతానికి చేరుకోగానే మళ్లీ డ్రైవర్  జె.దేవాయిరక్కంకు ఒక్క సారిగా విపరీతమైన గుండె నొప్పి వచ్చింది. అయితే ఎదురుగా వరుసుగా ఇసుక లారీలు వస్తున్నాయి. ఆ నొప్పిలోనూ ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో బస్సును అతి బలవంతం మీద కంట్రోల్ చేశాడు. రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి పోనిచ్చి ఆపేశాడు. చివరికి సీటులోనే కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయారు. 
 

click me!