టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి కారణం అదే - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

By Sairam Indur  |  First Published Feb 5, 2024, 9:58 AM IST

తెలంగాణలోని వాహనాల నెంబర్ ప్లేట్లపై ‘టీఎస్’ (TS)ను ‘టీజీ’ (TG)గా మార్చే నిర్ణయానికి మంత్రివర్గం (Telangana Cabinet) ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్రంలోని వాహనదారులపై ప్రభావం చూపే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas reddy) వివరించారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో రెండు హామీలకు ఆమోదం తెలపడంతో పాటు హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపు వంటి ముఖ్య నిర్ణయాలపై చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలోని వాహనాల నెంబర్ ప్లేట్లపై రాష్ట్ర పేరును సూచించే అక్షరాలనై ‘టీఎస్’ను ‘టీజీ’గా మార్చే కీలక నిర్ణయానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత..

Latest Videos

కాగా.. అసలు ‘టీఎస్’ నుంచి ‘టీజీ’గా మార్చడానికి గల కారణాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని సూచించే అక్షరాలుగా కేంద్ర ప్రభుత్వం ‘టీజీ’కి అనుమతి ఇచ్చిందని అన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని కావాలనే ‘టీఎస్’గా మార్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ‘టీజీ’గానే కొనసాగాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని మంత్రివర్గం కూడా ఆమోదించింది. 

వామ్మో.. మూడేళ్లుగా ఇండియన్ ఎంబసీలో ఐఎస్ఐ ఏజెంట్ విధులు.. చివరికి..

దీని వల్ల ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ కు ముందుగా రాష్ట్ర పేరును సూచించే అక్షరాలు ‘టీజీ’గానే ఉంటాయని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనితో పాటు అధికారికంగా అవసరమైన ఇతర సందర్భాల్లో కూడా ఇవే అక్షరాలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేయనున్నట్టు మంత్రి వివరించారు. అధికారిక గీతంగా ‘జయజయహే తెలంగాణ’ ఉంటుందని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రిజిస్టర్ అయిన అన్ని వాహనాలపై ‘టీఎస్’ అనే అక్షరాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రం రాకముందు, వచ్చిన కొత్తలో అందరూ ‘టీజీ’ అనే అక్షరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావించారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రంపై తమ కాంక్షను తెలియజేసేందుకు చాలా మంది తమ వాహనాలపై అనధికారికంగా ‘టీజీ’ అని నెంబర్ ప్లేట్లు పెట్టించుకున్నారు.

బీజేపీలో చేరాలని బలవంత పెడుతున్నారు - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

కాగా.. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీఎస్ అందరికీ అలవాటు అయిపోయిందని, దానిని అలాగే కొనసాగించడం వల్ల వస్తున్న నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఇలా పేర్లు మార్చడం వల్ల వాహనదారులు మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. కొత్త నెంబర్ ప్లేట్లను మళ్లీ కొనుగోలు చేయడం జేబుకు చిల్లు పెట్టే పని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే టీఎస్ గా ఉన్న నెంబర్ ప్లేట్లను మార్చుకోవాలా ? లేక కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకే ప్రభుత్వ నిర్ణయం వర్తింస్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

click me!