పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత..

By Sairam Indur  |  First Published Feb 5, 2024, 8:58 AM IST

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (Peddapalli ex-MLA Birudu Rajamallu passes away) అనారోగ్యంతో కన్నుమూశారు. టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. తరువాత బీఆర్ఎస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.



పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి చెందారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

Monkey Fever: కర్ణాటకలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతి.. ‘48 మందిలో గుర్తించాం’

Latest Videos

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లో ఆయన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో 1930లో జన్మించారు. ఆయన రాజకీయ జీవితం టీడీపీలో మొదలయ్యింది. ఆ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. మొట్టమొదట సుల్తానాబాద్ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తరువాత 1989లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

PM Modi: కరెంట్ బిల్లు జీరో చేయడానికి కేంద్రం అడుగులు: ప్రధాని మోడీ

మళ్లీ 1994లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డిపై 39677 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2018లో టీడీపీని వీడి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)లో చేరారు. 2023 లో కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపులో కీలక పాత్ర పోషించారు.

click me!