తెలంగాణ రాజ్ భవన్‌ను ముట్టడించిన విద్యార్ధులు: బైఠాయింపు, ఉద్రిక్తత

Published : Mar 14, 2023, 11:44 AM IST
తెలంగాణ రాజ్ భవన్‌ను  ముట్టడించిన విద్యార్ధులు: బైఠాయింపు, ఉద్రిక్తత

సారాంశం

కామన్ రిక్రూట్ మెంట్  బిల్లును  వెంటనే  ఆమోదించాలని  కోరుతూ  విద్యార్ధులు  ఇవాళ  రాజ్ భవన్ ను ముట్టడించారు  


హైదరాబాద్: తెలంగాణ  రాజ్ భవన్ ను  బీఆర్ఎస్ అనుబంధ విద్యార్ధి విభాగం  మంగళవారంనాడు ముట్టడించింది. బీఆర్ఎస్ అనుబంధ విద్యార్ధి సంఘం ఇచ్చిన పిలుపునకు  విద్యార్ధి  సంఘాల జేఏసీ మద్దతు ప్రకటించింది.  

 రాజ్ భవన్  ముందు  విద్యార్ధులు బైఠాయించారు.  రాజ్ భవన్ లోపలికి  చొచ్చుకెళ్లేందుకు  విద్యార్ధులు ప్రయత్నించారు. పోలీసుల ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సమయంలో  పోలీసులు. ఆందోళనకారులకు మధ్య  తోపులాట చోటు  చేసుకుంది.  ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. 

గవర్నర్ వద్ద పెండింగ్ లో  ఉన్న  కామన్ రిక్రూట్ మెంట్  బిల్లును ఆమోదించాలని  విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే గవర్నర్ ఈ బిల్లును పెండింగ్ లో  ఉంచారని విద్యార్ధి సంఘాల నేతలు  ఆరోపిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?