హుస్నాబాద్‌లో ఉద్రిక్తత: ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి గుడాటిపల్లి వాసులయత్నం, పోలీసుల లాఠీచార్జీ

By narsimha lodeFirst Published Jun 14, 2022, 8:26 PM IST
Highlights

హుస్నాబాద్ లో మంగళవారం నాడు  ఉద్రిక్తత చోటు చేసుకొంది. గుడాటిపల్లి వాసులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు పోటీగా టీఆర్ఎస్ ఆందోళనలు చేసింది. తమపై గుడాటిపల్లి వాసులు దాడులు చేశారని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులుఆరోపించారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. 

హుస్నాబాద్:  Siddipet జిల్లా Husnabad, ఎమ్మెల్యే Satish క్యాంప్ కార్యాలయాన్ని మంగళవారం నాడు  Gudatipally నిర్వాసితులు ముట్టడించే ప్రయత్నం చేశారు. భూ నిర్వాసితులకు పోటీగా TRS ఆందోళనకు దిగింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది.

Gouravelli ప్రాజెక్టు భూ నిర్వాసితులైన గుడాటిపల్లి వాసులపై పోలీసులు loty chargeకి నిరసనగా మంగళవారం నాడు కూడా ఆందోళనలు కొనసాగాయి. ఎమ్మెల్యే సతీష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు  ఆందోళనకారులు ప్రయత్నించారు.  భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున హుస్నాబాద్ కు తరలి వచ్చారు. ఆందోళన కారులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హుస్నాబాద్ బస్టాండ్, మల్లెచెట్టు చౌరస్తా వద్ద ఆందోళనలు నిర్వహించారు. హన్మకొండ-హుస్నాబాద్ ప్రధాన రహాదారిపై వంటా వార్పు చేస్తూ ఆందోళనకారులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు ఆందోళనకారులకు వ్యతిరేకంగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారుల దాడిలో ఏసీపీకి స్వల్ప గాయాలయ్యాయి.  పోలీసుల లాఠీచార్జీ  చేయడంతో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. తమపై ఆందోళనకారులు దాడి చేశారని టీఆర్ఎస్ కు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. 

తమకు పరిహారం చెల్లించకుండా  సర్వే చేయడానికి వీల్లేదని గుడాటిపల్లి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో గుడాటిపల్లి ముంపునకు గురౌతుంది. అయితే ఆదివారం నాడు అర్ధరాత్రి పలువురిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. 

ఈ లాఠీచార్జీని నిరసిస్తూ Congress పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం బంద్ కు పిలుపునిచ్చింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిర్వాసితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఆదివారం నుండి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి.. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు మరోమారు ఆందోళనకు దిగారు. హుస్నాబాద్ పోలీసు స్టేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలోనే ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిర్వాహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

click me!