హన్మకొండలోని బీజేపీ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకొంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతకు చెందిన కారు ధ్వంసమైంది.
హన్మకొండ: హన్మకొండలోని BJP కార్యాలయం వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ తో బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు Congress పార్టీ కార్యకర్తలు, నేతలు హన్మకొండ బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
ఈ సమయంలో బీజేపీ కార్యాలయంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు తమపై దాడికి దిగారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తమ పార్టీ కార్యకర్తలు, నేతలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ నేతలు దాడికి దిగారని కాంగ్రెస్ నేత Rajender Reddy చెప్పారు. తాము నిరసనకు దిగకుండా పోలీసులు అడ్డుకున్నారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
Telangana రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మోడీ నెరవేర్చలేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైద్రాబాద్ కు మోడీ రానున్న నేపథ్యంలో నిరసనకు తెలిపేందుకు వచ్చిన సమయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.