ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లు:హైద్రాబాద్ లో 300 చోట్ల చార్జింగ్ సెంటర్లు

Published : Jul 01, 2022, 04:00 PM IST
 ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లు:హైద్రాబాద్ లో 300 చోట్ల చార్జింగ్ సెంటర్లు

సారాంశం

ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. హైద్రాబాద్ తో పాటు సమీపంలోని ప్రాంతాల్లో సుమారు 300కిపైగా చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ప్లాన్ చేస్తుంది.జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిల్లో చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 

హైదరాబాద్: Electric Vehicle లకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. :GHMC  పరిధిలో 230, HMDA  పరిధిలో 100 చోట్ల Charging stations  ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా 14 పబ్లిక్ సెంటర్లలో చార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహస్తున్నాయి. Petrol , Diesel  ధరలు విపరీతంగా పెరిగాయి.పెట్రోల్, డీజీల్ వాహనాల కారణంగా కాలుష్యం కూడా పెరిగిపోతుంది.,ఈ తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ కార్లు, Bikeలు మార్కెట్లోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్రోల్, డీజీల్ బంకుల మాదిరిగానే ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేసన్లను  కూడా ఏర్పాటు చేయనున్నారు.

Telangana విద్యుత్ శాఖ ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.

ఒక్కో ఎలక్ట్రిక్ చార్జింగ్ సెంటర్ కు కనీసం రూ. 50 నుండి  రూ. 60 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఒక్కో వాహనం పూర్తి స్థాయిలో చార్జింగ్ కావాలంటే కనీసం గంట నుండి 90 నిమిషాలు పట్టే అవకాశం ఉంది.  అయితే గంటకు రూ. 18 నుండి 30 కిలోవాట్ గా నిర్ణయించే అవకాశం ఉంది.  అయితే దీనిలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హైద్రాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను పెట్రోల్ బంకులతో పాటు రైల్వే స్టేషన్ల సమీపంలో ఏర్పాటు చేయనున్నారు.

పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రయాణం చేసే సమయంలో చార్జింగ్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో చార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ ప్రయత్నాలు చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్