భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంబులెన్స్ మొరాయించడంతో చుడికి అనే మహిళ మరణించింది. పురుగుల మందు తాగిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో బైక్ పై ఆమెను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడంతో బాధితురాలు మరణించింది.
కొత్తగూడెం: Bhadradri Kothagudem జిల్లాలో 108 Ambulance మొరాయించడంతో Chudiki అనే మహిళ మరణించింది. అంబులెన్స్ మొరాయిస్తున్న విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడ పలితం లేకుండా పోయిందని 108 సిబ్బంది చెబుతున్నారు.
జిల్లాలోని Cherla mandal మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన మహిళ కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగింది.ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు గాను 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 వాహనం రాగానే ఆ వాహనంలో బాధితురాలిని ఎక్కించారు.తాలిపేరు కు సమీపంలో అంబులెన్స్ వాహనం మొరాయించింది. దీంతో కొద్దిసేపు ఈ వాహనం తిరిగి స్టార్ట్ అవుతుందోమోనని బాధిత కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ వాహనం స్టార్ట్ కాలేదు. Bike పై మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత బాధిత మహిళను వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించిందని తెలిపారు.
అంబులెన్స్ వాహనం మొరాయించకపోతే మహిళ బతికేదని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 108 వాహనం రిపేర్లు వస్తుందని చెప్పినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని 108 సిబ్బంది ఆరోపిస్తున్నారు. సకాలంలో బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తే ఆమె బతికేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.