సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ లోకి.. !!

By AN Telugu  |  First Published Nov 15, 2021, 2:35 PM IST

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 


మెదక్ : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో TRS లో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. 

కాగా, తెలుగు రాష్ట్రాల్లో మరోసారి MLC Electionsల సందడి నెలకొంది.  అటు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో దాదాపు అందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేయగా... తెలంగాణలో మాత్రం ఇంకా ఫైనలైజ్ చేసే పనిలో కెసిఆర్ నిమగ్నమయ్యారు. 

Latest Videos

undefined

అయితే ఈ రోజు ఉదయం వరకు ఈ స్థానిక సంస్థల కోటాలో కలెక్టర్ పోటీ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈయన పేరు మాత్రం ఎన్నికలొచ్చిన ప్రతీసారి ల్లో ప్రతిసారి తెరపైకి వస్తుంది ఆయన మరెవరో కాదు మెదక్ జిల్లా కలెక్టర్ Venkatramireddy.  స్థానిక సంస్థల కోటాలో వెంకట్రామిరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ లేదా రేపు కలెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. ప్రగతి భవన్ నుంచి పేరు ఖరారైందని సమాచారం వచ్చిన మరుక్షణమే వెంకట్రామి రెడ్డి తన పదవికి రాజీనామా ఇస్తారని అనుకున్నారు. దీనికి తగ్గట్టుగానే తాజాగా వెంకట్రామిరెడ్డి కలెక్టర్ పదవికి రాజీనామా చేారు.  

వాస్తవానికి ఈయన పేరు ఇలా ప్రచారంలోకి రావడం ఇదే మొదటిసారేం కాదు.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా  ఒకానొక దశలో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టిఆర్ఎస్ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డికి టికెట్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. చివరి క్షణంలో అది కూడా చేజారడంతో ఆయన కొంత నిరాశకు లోనయ్యారు. తర్వాత కలెక్టర్ గా తన పని తాను చేసుకుపోతున్నారు.

Telangana MLC elections: సాయంత్రం టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. రేస్‌లో వీళ్లే..!

ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ కలెక్టర్ పేరును కెసిఆర్ పరిశీలించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ... మళ్లీ ఆయనే అభ్యర్థిగా ప్రకటించకుండా గులాబీ బాస్ మిన్నకుండిపోయారు.  అయితే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చవి చూడగా.. బిజెపి తరఫున పోటీ చేసిన రఘునందన్ రావు విజయం సాధించారు కాగా, గతంలో  ఓ సందర్భంలో కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. 

కాగా దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు పలువురు ఐఏఎస్లు ఐపిఎస్లు ఎస్ఐలు ఆఖరికి కానిస్టేబుల్స్ కూడా అసెంబ్లీ పార్లమెంటుకు వెళ్లిన దాఖలాలు చాలానే ఉన్నాయి. 

click me!