రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో విషాదం నెలకొంది.అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో లింగం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విషాదం చోటు చేసుకుంది. అప్పును తీసుకున్న వ్యక్తి చెల్లించకపోవడంతో మనో వేదనకు గురైన లింగం అనే అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లింగం మృతదేహంతో అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటి ముందు పేరేంట్స్ ,కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు.దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు.లింగం అనే వ్యక్తి తన బంధువులకు కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు.ఈ అప్పును ఆయన తిరిగి రాబట్టుకోలేకపోయాడు.అప్పు చెల్లించే విషయంలో అప్పు తీసుకున్నవారి నుండి సానుకూలమైన స్పందన రాలేదనే మనోవేదనతో లింగం పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగం మృతిచెందాడు. అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటి ముందు డెడ్ బాడీతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు.ఎలాంటి అవాంఛనీయసంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజూ ఆత్మహత్యల కేసులు నమోదౌతూనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి..ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనలు నెలకొన్నాయి. విశాఖపట్టణంలో ఇటీవలనే భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే భార్య పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 20వ ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకున్న నాలుగు మాసాల తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
ఈ నెల 19న విశాఖపట్టణంలోని లాడ్జీలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ జంట లాడ్జీలో కిటీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.హైద్రాబాద్ చందానగర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ నెల 17న ఈ ఘటన చోటు చేసుకుంది.మరోవైపు లోన్ యాప్ సంస్థల వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడ రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయి.