పెన్షన్ కోసం తెలంగాణ సచివాలయం ముట్టడికి దివ్యాంగుల యత్నం: ఉద్రిక్తత, అరెస్ట్

Published : Aug 21, 2023, 11:05 AM IST
పెన్షన్ కోసం తెలంగాణ సచివాలయం ముట్టడికి దివ్యాంగుల యత్నం: ఉద్రిక్తత, అరెస్ట్

సారాంశం

పెన్షన్ కోసం  దివ్యాంగులు  ఇవాళ  తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. 

హైదరాబాద్:  పెన్షన్ ఇవ్వాలని డిమాండ్  చేస్తూ  దివ్యాంగులు  సోమవారంనాడు తెలంగాణ సెక్రటేరియట్‌ ముట్టడికి ప్రయత్నించారు. దివ్యాంగులు సెక్రటేరియట్ కు  ముట్టడించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  దివ్యాంగుల పెన్షన్ ను  రూ. 3116 నుండి రూ,4116కు  పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. అయితే  పెంచిన పెన్షన్ తమకు అందడం లేదని కొందరు దివ్యాంగులు సెక్రటేరియట్ ముందు మెరుపు ధర్నాకు ప్రయత్నించారు.  

ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది  ఆందోళనకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉద్యోగాల నియామకాల్లో తమకు రిజర్వేషన్ ను అమలు చేయాలని  దివ్యాంగులు డిమాండ్  చేస్తున్నారు.

 


  

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?