బండి సంజయ్ ను మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ వాహానంపై చెప్పులు విసిరారు
వరంగల్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు తీసుకెళ్లే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు చెప్పులు విసిరారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. బండి సంజయ్ ను తరలిస్తున్న వాహనంపై బీఆర్ఎస్ శ్రేణులు చెప్పులు విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. బండి సంజయ్ వాహనంపై బీఆర్ఎస్ శ్రేణులు చెప్పులు ,కోడిగుడ్లను విసిరారు.
బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దరమిలా పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుండి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ మేజిస్ట్రేట్ ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. బీజేపీ శ్రేణులు మరో వైపు బండి సంజయ్ ను తరలిస్తున్న వాహనానికి బీజేపీ శ్రేణులు అడ్డుపడ్డారు. బండి సంజయ్ వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు.
also read:బండి సంజయ్ అరెస్ట్: హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు
టెన్త్ క్లాస్ పేపర్ ను ప్రశాంత్ వాట్సాప్ లో బండి సంజయ్ కు షేర్ చేశారు. ఈ విషయంలో కుట్ర జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. పేపర్ ను వాట్సాప్ లో షేర్ చేయడం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీజేపీ నేతలతో ప్రశాంత్ ఫోన్ లో మాట్లాడిన విషయాలను బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ కేసులో బండి సంజయ్ ను నిన్న రాత్రి కరీంనగర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ నుండి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బోమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుండి బండి సంజయ్ ను ఇవాళ మధ్యాహ్నం వరంగల్ జిల్లాకు తరలించారు.
టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన తర్వాత వరుసగా తాండూరు , వరంగల్ లలో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్ లలో పేపర్లు బయటకు వచ్చాయి. ఈ విషయమై బీజేపీ నేతలు కుట్ర పన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.