బండి సంజయ్ అరెస్ట్: హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు

Published : Apr 05, 2023, 04:23 PM ISTUpdated : Apr 05, 2023, 10:00 PM IST
  బండి  సంజయ్ అరెస్ట్:  హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్  ముందు  హాజరు

సారాంశం

బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను  హన్మకొండ మేజిస్ట్రేట్ ముందు  హాజరుపర్చారు.  

హన్మకొండ:  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ను  హన్మకొండ ప్రిన్సిపల్  మేజిస్టేట్  ఎదుట  బుధవారంనాడు హాజరుపర్చారు  పోలీసులు . హన్మకొండలోని  ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్   రాపోలు అనిత  ముందు  బండి సంజయ్ ను హాజరుపర్చారు.  మేజిస్ట్రేట్   ఇంటి వెనుక గేటు నుండి  బండి సంజయ్ ను పోలీసులు తీసుకెళ్లారు. 

ఇవాళ ఉదయం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్  నుండి   వరంగల్ కు తీసుకుచ్చారు.   ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  పాలకుర్తి  ప్రభుత్వాసుపత్రికి  బండి సంజయ్ ను  తీసుకెళ్లారు.  పాలకుర్తి ఆసుపత్రిలో  బండి సంజయ్ కు  వైద్య పరీక్షలు నిర్వహించారు . అక్కడి నుండి  ఆయనను మడికొండలోని  పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. మడికొండ  పోలీస్ ట్రైనింగ్  సెంటర్  నుండి  బండి సంజయ్ ను హన్మకొండ లోని ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్  ముందు  బండి సంజయ్ ను హాజరుపర్చారు పోలీసులు. 

also read:బండి సంజయ్ అరెస్ట్ పై తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిషన్: రేపు విచారణ

టెన్త్ క్లాస్  పేపర్ వాట్సాప్ లో  షేర్  చేసిన అంశానికి సంబంధించి  బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు  చేశారు.  ఈ కేసులో అరెస్టు చేసిన  బండి సంజయ్ ను  కరీంనగర్  నుండి  బొమ్మలరామారం  పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి  వరంగల్ కు తరలించారు. బండి సంజయ్ మేజిస్ట్రేట్   ను పోలీసులు  హాజరుపర్చిన నేపథ్యంలో  బీజేపీ లీగల్ టీమ్ కూడా   మేజిస్ట్రేట్  నివాసంలోకి వెళ్లింది.   


 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?