బతుకమ్మల మీదినుంచి దూసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు, ఉద్రిక్తత..

By AN TeluguFirst Published Oct 7, 2021, 8:44 AM IST
Highlights

హనుమకొండ జిల్ల ఆత్మమకూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ఆత్మకూరు : మహిళలంతా బతుకమ్మలతో వచ్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా ఓ కారు ఆ బతుకమ్మల మీదుగా దూసుకెళ్లింది. దీంతో బతుకమ్మలు చెల్లా చెదురయ్యాయి. అది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనం. ఆ సమయంలో ఆయన వాహనంలోనే ఉన్నారు.

లఖీంపూర్ లో జనాల మీదినుంచి వాహనం నడిపాడో ఎంపీ కొడుకు.. హనుమకొండలో బతుకమ్మలమీదినుంచి వాహనం నడిపాడు ఓ ఎమ్మెల్యే. ఈ రెండు ఘటనలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారో కళ్లకు కడుతున్నాయి. 

హనుమకొండ జిల్ల ఆత్మమకూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. 

బతుకమ్మలంటే ఓ విశ్వాసం, ఓ నమ్మకం. ఒక్కసారి బతుకమ్మ పేర్చి ఇంట్లో నుంచి బైటికి తెచ్చారంటే మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లరు. అలాగే ఒక్కసారి ఆడడానికి ఒక దగ్గర పెట్టారంటే.. అవి తీస్తే నిమజ్జనానికే.. మధ్యలో తీసి వేరే చోట పెట్టడం ఇలాంటివి అరిష్టం అని నమ్ముతారు. అయితే ప్రజల విశ్వాసాలను తుంగలో తొక్కాడో ఎమ్మెల్యే.

ఆత్మకూరుకు వచ్చిన challa dharma reddy అక్కడి సెంట్రల్ లైంటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో పోచమ్మ సెంర్ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు batukammaలు పెట్టుకుని ఆడుకుంటున్నారు. 

భార్యను చచ్చేట్టు కొట్టి, గొంతుకు ఉరివేసి... గుండెపోటు అని నమ్మించాలని చూసి...

mla వస్తున్నారని, రోడ్డుమీది నుంచి బతుకమ్మలు తీసేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమనిి మహిళలు తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న సర్పంచ్ పర్వతగిరి రాజు ఓ పక్క నుంచి ఎమ్మెల్యే కారును పోనివ్వండని ప్రాధేయపడ్డా పోలీసులు, అనుచరులు వినిపించుకోలేదు. 

బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతన నెలకొంది. ధర్మారెడ్డి కారును గ్రామస్తులు, మహిళలు అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. villagersను పోలీసులు తోసేయడంతో కొందరు సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఆత్మకూరు సీఐ రంజిత్, అదనపు పోలీసులను రప్పించి అక్కడి నుంచి ఎమ్మెల్యే వాహనాన్ని పంపించారు. 

click me!