వలపు వల విసిరి.. బావతో కలిసి యువతి రూ.1.20కోట్లకు టోకరా.. !

Published : Oct 07, 2021, 07:26 AM ISTUpdated : Oct 07, 2021, 07:37 AM IST
వలపు వల విసిరి..  బావతో కలిసి యువతి రూ.1.20కోట్లకు టోకరా.. !

సారాంశం

కుత్బుల్లాపూర్ లో నివాసముండే తన బావ సాయిరాం ద్వారా ఏపీ లోని గుంటూరుకు చెందిన యువ రైతు సుబ్బారెడ్డి (35)తో పరిచయం ఏర్పడింది. తాను నిర్వహించే వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక డబ్బులు ఇస్తా అంటూ అతనిని నమ్మించింది. అలాగే తన WhatsApp డీపీ నెంబర్ గా అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకుని honey trap చేసింది. అలా సుబ్బారెడ్డి తో చాటింగ్ చేసేది.  

అంబర్ పేట్ : ఒక యువతి విసిరిన వలపు వలలో ఓ యువరైతు చిక్కుకున్నాడు. ఏకంగా రూ.1.25 కోట్లకు మోసపోయాడు. తీరా విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ఈ సంఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... 

అంబర్పేట్ డిడి కాలనీలో నివసించే ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు శ్రీనివాస్ కుమార్తె అర్చన (24)  బ్యూటీషియన్  కోర్సు చేసింది.  అనంతరం కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఆమె beauty parlour లు నిర్వహించింది.

ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ లో నివాసముండే తన బావ సాయిరాం ద్వారా ఏపీ లోని గుంటూరుకు చెందిన యువ రైతు సుబ్బారెడ్డి (35)తో పరిచయం ఏర్పడింది. తాను నిర్వహించే వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక డబ్బులు ఇస్తా అంటూ అతనిని నమ్మించింది. అలాగే తన WhatsApp డీపీ నెంబర్ గా అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకుని honey trap చేసింది. అలా సుబ్బారెడ్డి తో చాటింగ్ చేసేది.  

దీంతో పూర్తిగా నమ్మిన అతను సంబంధిత వ్యాపారంలో పెట్టుబడి కోసం గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం ఆగష్టు వరకు పలు విడతలుగా ఆన్లైన్లో  లో రూ. 1.20 కోట్లు చెల్లించాడు. అప్పటివరకు అర్చనను చూడని అతడు నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

హైదరాబాద్: ఒకే మహిళతో ఇద్దరు యువకుల అక్రమసంబంధం... ఒకరి దారుణ హత్య

మరోవైపు, పెట్టుబడి పేరిట తనకు అందిన సొమ్ముతో అర్చన తన ప్రియుడు అనిల్ కుమార్ తో కలిసి జల్సాలు చేసింది. బంగారు ఆభరణాల కొనుగోలు  సహా, కారునూ బహుమతిగా ఇచ్చింది.  అయితే సుబ్బారెడ్డి తన డబ్బు ఇవ్వాలంటూ యువతిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.  

దీంతో యువతి ప్రియుడితో కలిసి అతడిని చంపుతాను అంటూ అర్చన బెదిరించింది. ఎట్టకేలకు ఆమె నగరంలో ఎక్కడ ఉంటుంది తెలుసుకున్న సుబ్బారెడ్డి.. ఈనెల ఒకటో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెండో తేదీన అర్చన, అనిల్ కుమార్ తో పాటు సాయిరాంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu