మల్లన్న ముంగిట శృంగారలీలలు

Published : Dec 14, 2016, 09:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మల్లన్న ముంగిట శృంగారలీలలు

సారాంశం

కొమరవెల్లి దేవస్థానంలో అనైతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రాంతంలో ఏఈవో రాసలీలలు గతం నుంచే ఆయనపై అనేక ఆరోపణలు

భక్తుల కొంగుబంగారు కొమరవెల్లి మల్లన్న ఆలయ పరిసరాల్లో మహాపచారం జరిగింది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మూలవిరాట్టునే మార్చేయాలని కంకణం కట్టుకొని ప్రయత్నాలు చేస్తుంటే.. అక్కడి అధికారులు మరింత రెచ్చిపోతున్నారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఆ ప్రదేశంలో మహాపచారానికి ఒడిగడుతున్నారు.

 

కొమరవెల్లి దేవస్థానం ఏఈవో గా పనిచేస్తున్న ఆయన ఇంటి పేరు వైరాగ్యం.. కానీ ఎప్పుడూ వై‘భోగం’తోనే ఉంటారు.

 

ఏకంగా గుడి ఆవరణలోనే ‘దుకాణం’ తెరిచారు. ఆలయ బుకింగ్‌ ఆఫీసులోనే ముద్దు ముచ్చట్లు కొనసాగిస్తూ తన పనినికొనసాగిస్తున్నారు.

 

దేవస్థానం చుట్టుపక్కల షాపులవాళ్లను బెదిరిస్తూ నిరాటంకంగా తన వైభోగాన్ని ప్రదర్శిస్తున్నారు.

 

ఆలయ ఏఈవోగా ఉన్న వైరాగ్యం అంజయ్య పై గతం నుంచే అనేక ఆరోపణలున్నాయి. అతని రాసలీలపై గుర్తు తెలియని వ్యక్తులు గతంలో కరపత్రాలు వేసి మరీ ప్రచారం చేశారు.

 

అయినా పై అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంజయ్య రాసలీలలకు సంబంధించిన ఫొటోలను ఆయన బాధితులు   సోషల్ మీడియాలో పెట్టారు.ఆయనపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

 

గతంలో మల్లన్న పూజారులపై చేయి చేసుకున్న ఘనత కూడా ఈయనగారికి ఉంది. దీంతో ఆయనను సస్పెండ్  కూడా చేశారు.  ఇక్కడి నుంచి చాలా సార్లు బదిలీ అయినా కూడా  పై అధికారులను ప్రసన్న చేసుకొని మళ్లీ మల్లన్న చెంతకే వచ్చి తన వైభోగాన్ని వెలగబెడుతున్నాడు వైరాగ్యం అంజయ్య.

 

ఇప్పుడైనా ఆయనను దేవస్థానం నుంచి తొలగించి ఆలయ పవిత్రతను ప్రభుత్వం కాపాడుతుందో లేదో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!