హైదరాబాద్ ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌ల భేటీ కొనసాగుతోంది. సుమారు 3 గంటల నుంచి వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చలు జరుపుతున్నారు.
హైదరాబాద్ ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌ల భేటీ కొనసాగుతోంది. సుమారు 3 గంటల నుంచి వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చలు జరుపుతున్నారు.
లోటస్‌పాండ్ నుంచి ప్రగతిభవన్ చేరుకున్న జగన్‌కు సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా చంద్రశేఖర్ రావును జగన్ ఆహ్వానించారు.
దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు ఏపీ సీఎం అందించారు. ఈ భేటీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో పాటు విభజన అంశాలు, ఏపీ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లోని సంస్థల విభజన సంస్థలపై సుధీర్ఘంగా చర్చించారు.