జ్యూవెలరీ షోరూంలో చోరీకి యత్నం.. అడ్డుకోబోయిన ఎస్సై పైకి కారు

Siva Kodati |  
Published : Sep 23, 2019, 07:48 PM ISTUpdated : Sep 23, 2019, 07:56 PM IST
జ్యూవెలరీ షోరూంలో చోరీకి యత్నం.. అడ్డుకోబోయిన ఎస్సై పైకి కారు

సారాంశం

హైదరాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షోరూంలో చోరీకి దొంగలు యత్నించారు.. వీరి ప్రయత్నాన్ని అడ్డుకోబోయిన ఎస్సై పైకి దొంగలు కారును ఎక్కించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సినీ ఫక్కీలో కారును వెంబడించి పట్టుకున్నారు

హైదరాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షోరూంలో చోరీకి దొంగలు యత్నించారు.. వీరి ప్రయత్నాన్ని అడ్డుకోబోయిన ఎస్సై పైకి దొంగలు కారును ఎక్కించేందుకు విఫలయత్నం చేశారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు సినీ ఫక్కీలో కారును వెంబడించి పట్టుకున్నారు. పోలీసులకు భయపడిన దొంగలు దూలపల్లి అడవుల్లోకి పారిపోయారు. కారుతో పాటు చోరీకి తెచ్చిన కట్టర్, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

అంతకుముందు చోరీ చేసిన కారుతో అల్వాల్‌లోని ఓ ఏటీఎంలో దొంగలు చోరీకి యత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!