డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులో కబాలి సినీ నిర్మాత కె.పి.చౌదరి...

Published : Jun 14, 2023, 08:40 AM ISTUpdated : Jun 14, 2023, 08:49 AM IST
డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులో కబాలి సినీ నిర్మాత కె.పి.చౌదరి...

సారాంశం

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. డ్రగ్స్ తీసుకుంటున్న కబాలి నిర్మాత కె.పి. చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. ఈ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరు నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కబాలి చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నట్లు సమాచారం.  ఆయన వద్ద ఉన్న కొకైన్ ను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు