బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ దాడులు, 70 బృందాలతో తనిఖీలు..

Published : Jun 14, 2023, 07:29 AM ISTUpdated : Jun 14, 2023, 09:48 AM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ దాడులు, 70 బృందాలతో తనిఖీలు..

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయం, సిబ్బంది ఇళ్లలో ఐడీ దాడులు జరుగుతున్నాయి. 

హైదరాబాద్ : బుధవారం ఉదయంనుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ సోదాలు.. నిర్వహిస్తోంది. మొత్తం 70 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ సోదాలు మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అనేక కంపెనీల్లో బినామీగా ఉన్నాడని.. 15 కంపెనీల్లో పెట్టుబడిదారుగా ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.  

పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు డైరెక్టర్ గా పైళ్ల శేఖర్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ తో పాటు, బెంగళూరు కార్యలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. బంెగళూరులో శేఖర్ రెడ్డి బంధువు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాటజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!