తెలుగు అకాడమీ స్కామ్: మరో ముగ్గురి అరెస్ట్, 14కు చేరిన అరెస్టుల సంఖ్య

Published : Oct 09, 2021, 05:08 PM IST
తెలుగు అకాడమీ స్కామ్: మరో ముగ్గురి అరెస్ట్, 14కు చేరిన అరెస్టుల సంఖ్య

సారాంశం

తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో సీసీఎస్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 14కు చేరుకుంది. తాజాగా అరెస్టయిన ముగ్గురు ప్రధాన నిందితుడు సాయి కుమార్ కు సహకరించినట్లు భావిస్తున్నారు.

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. రమణారెడ్డి, భూపతి, వినయ్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో Telugu Akademi scam కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరుకుంది. నకిలీ ఎఫ్ డీల తయారీలో తాజాగా అరెస్టైన ముగ్గురు కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సాయి కుమార్ కు వారు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. 

ఈ కేసులో 9 మందిని తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తెలంగాణ అకాడమీకి చెందిన 64.5  కోట్ల రూపాయలను ముఠా కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర సంచలనం సంచలనం సృష్టించింది. ఈ కేసులో యుబిఐ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీతో పాటు తెలుగు అకాడమీ ఏసీవో రమేష్ అరెస్టయ్యారు.  

Also Read: telugu academy scam: నిందితుల గాలింపులో సీసీఎస్ పురోగతి.. కొయంబత్తూరులో పద్మనాభన్ అరెస్ట్

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంపై దర్యాప్తునకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే Enforcement Directorate (ED)కి అందించారు. కొల్లగొట్టిన తెలుగు అకాడమీ నిధులను నిందితులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్లు గుర్తించారు. కొంత మంది తమ అప్పులను తీర్చుకున్నట్లు కూడా చెబుతున్నారు. 

మనీలాండరింగ్ చట్టం కింద తెలుగు అకాడమీ కుంభకోణం కేసుపై ఈడీ దర్యాప్తు చేయనుంది. తెలుగు అకాడమీ నిధులను కొల్లగొట్టడానికి నిందితులు పక్కా ప్లాన్ వేసి అమలు చేశారు. నిజానికి, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం రూ.320 కోట్లు కొట్టేయాలని స్కెచ్ వేసినట్లు భావిస్తున్నారు.  

Also Read: Telugu Akademi Scam : చౌక డీజిల్ కోసం రూ.కోట్లు, ఓఆర్ఆర్ దగ్గర 35 ఎకరాలు.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు..

పద్మనాభన్ అనే నిందితుడిని పోలీసులు కోయంబత్తూరులో అరెస్టు చేశారు. దీంతో అరెస్టయినవారి సంఖ్య11కు చేరుకుంది. తాజా మూడు అరెస్టులతో ఆయన సంఖ్య 14కుచేరుకుంది. 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు