దెబ్బ కొట్టే కొద్దీ ఎదుుగుతా: జై తెలంగాణ అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగం

By telugu teamFirst Published Oct 9, 2021, 4:49 PM IST
Highlights

తెలంగాణ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కొడుతున్న కొద్దీ తాను ఎదుగుతానని పవన్ కల్యాణ్ అన్నారు.

హైదరాబాద్: దొబ్బ కొట్టే కొద్దీ మంరిత ఎదుగుతానని జనేసన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బలమైన సామాజిక మార్పు కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ జనసేన సైనికులను ఉద్దేశించి ఆయన శనివారంనాడు ప్రసంగించారు. 2009లో తాను తెలంగాణలో సంపూర్ణంగా పర్యటించానని ఆయన చెప్పారు. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  

2009లో తాను సభ పెడితే తెలంగాణ నుంచి పది లక్షల మంది వచ్చినట్లు ఆయన చెప్పారు. అన్నింటికీ సిద్ధపడే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. రాజకీయ చదరంగంలో ఒక్కో అడుగు వేయాలంటే ఎంతో ఆలోచించాలని ఆయన చెప్పారు. 

మీ స్ఫూర్తి, పోరాటమే తనను ఇంత దాకా తీసుకుని వచ్చిందని ఆయన తెలంగాణ జనసైనికులను ఉద్దేశించి అన్నారు. బలమైన సామాజిక మార్పు కోసం తాను పనిచేస్తానని ఆయన చెప్పారు. అడుగు పెడితే తప్ప అనుభవం రాదని ఆయన అన్నారు. 

తాను హైదరాబాదు నుంచి అదిలాబాద్ వరకు తిరిగినవాడినని ఆయన చెప్పారు. గెలుస్తాననని తాను రాజకీయాల్లోకి రాలేదని, పోరాటం చేసేందుకే వ్చాచనని ఆయన చెప్పారు. రాజకీయాల్లో బలమైన భావం జాలం కావాలని ఆయన అన్నారు. 

తెలంగాణ భాషను, యాసను అగౌరవపరచడంతో తాను ఎంతో బాధపడ్డానని ఆయన చెప్పారు. చాలా మంది టీఆర్ఎస్ నేతల మాటలను తాను సమర్థించినట్లు ఆయనతెలిపారు. ప్రజల కన్నీళ్లను తుడిచేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఒక కులం వర్గ శత్రువు అని నిర్ధారించడం వల్ల అభివృద్ధి జరగడం లేదని ఆయన చెప్పారు. తమకు వర్గశత్రువు పేదరికం, దౌర్జన్యం, అవినీతి అని వారు అన్నారు. ఆదిలాబాదులో నీళ్లు రాకపోతే ఎవరు అడ్డుకుంటున్నారని, అది వర్గశత్రువు అని ఆయన చెప్పారు. తాను వ్యక్తులను వర్గ శత్రువుగా భావించబోనని ఆయన చెప్పారు. 

వ్యక్తులపై కోపం పెట్టుకోనని, వైసీపీ నాయకులు తనకు శత్రువు కాదని ఆయన చెప్పారు. అందరం కలిసి నేల కోసం పనిచేద్దామనేది తన ఆలోచన అని ఆయన అన్నారు. 

ఇప్పటి వరకు తెలంగాణలో పవన్ కల్యాణ్ పెద్దగా రాజకీయాల్లో పాలు పంచుకోలేదు. ఇక తెలంగాణలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తారా అనే ఆలోచనను రేకెత్తించే విధంగా ఆయన ప్రసంగం సాగింది.   ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం ఉండాలని ఆయన అన్నారు. 

తెలంగాణపై తనకు తనకున్న మమకారం మామూలుది కాదని ఆయన అన్నారు. పవన్ కు ఏం తెలుసునని చాలా మంది అంటున్నారని, ఏదైనా అడుగు ముందుకు వేస్తేనే తెలుస్తుందని, అందుకే తాను అడుగు ముందు వేస్తున్నానని ఆయన అన్నారు. అడుగు పడితేనే అనుభవం వస్తుందని ఆయన అన్నారు. మీ గుండెల్లో స్థానం కన్నా తనకు మరేదీ వద్దని ాయన అన్నారు. 

click me!