తెలుగు అకాడమీ స్కాం : ఎఫ్‌డీల కుంభకోణంలో మరొకరికి బేడీలు.. ఆమె ఎవరంటే...

By SumaBala BukkaFirst Published Dec 3, 2021, 10:57 AM IST
Highlights

తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల కుంభకోణం, నిధుల గల్లంతు వ్యవహారంలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆమె ఏపీకి చెందిన మహిళగా సమాచారం. ఈ కేసులో అకాడమీకి చెందిన రూ.64.50 కోట్లు గల్లంతైన విషయం తెలిసిందే. 

హిమాయత్ నగర్ : Telugu Academy ఫిక్స్ డ్ డిపాజిట్ల కుంభకోణం, నిధుల గల్లంతు వ్యవహారంలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆమె ఏపీకి చెందిన మహిళగా సమాచారం. ఈ కేసులో అకాడమీకి చెందిన రూ.64.50 కోట్లు గల్లంతైన విషయం తెలిసిందే. 

పక్కా పథకంతో Academy fundingను కొల్లగొట్టిన ప్రధాన సూత్రధారులు చుండూరి వెంకట కోటి సాయి కుమార్, నండూరి వెంకట రమణలు గతంలో ఏపీ రాష్ట్రంలో పలు ప్రభుత్వ సంస్థలకు చెందిన Bank depositsను కొల్లగొట్టిన కేసుల్లోనూ నిందితులు.  ఈ నేపథ్యంలో పాత కేసుల్లో వీరికి సహకరించిన వారిని కూడా సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు.

దీంతో మరి కొందరి ప్రమేయం వెలుగులోకి వస్తోంది. అకాడమీ కేసులో నిందితుడిగా ఉన్న యోహన్ రాజు  భార్యను తాజాగా Vijayawadaలో అరెస్టు చేసినట్లు తెలిసింది. దీంతో అరెస్టయిన నిందితుల సంఖ్య 18కి చేరుకుంది. నిధుల రికవరీ దశలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల పెట్టుబడులు, స్థిర, చరాస్తులను ఫ్రీజ్, అటాచ్ చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. ప్రధాన సూత్రధారి  సాయి కుమార్, సహ నిందితుడు వెంకటరమణ విశాఖ శివార్లలోని  వివాన్ ప్రాజెక్టులో ఫ్లాట్ లను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. 

ఆయా ప్లాట్ల వివరాలు ఇవ్వాలంటూ Vivan Project అధినేతను దర్యాప్తు అధికారులు కోరగా, వారికి ఆ వివరాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, తెలుగు అకాడమీ అధికారులు నిందితులుగా ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగుల ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరుతూ సీసీఎస్ పోలీసులు ఇటీవల ఏసిఈ కోర్టును ఆశ్రయించారు. 

ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కేసులో  తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 26న సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు తీవ్రత దృష్ట్యా సీసీఎస్ నుంచి ఏసీబీకి బదిలీ చేసింది. బ్యాంక్ అధికారుల సిబ్బంది పాత్ర ఉన్నందున ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. 

కాగా.. తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్లు కాజేసిన కేసులో పదహారో నిందితుడు కృష్ణారెడ్డిని ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. telugu akademi scamకి చెందిన రూ.65.05 కోట్ల FDలను కొల్లగొట్టిన సాయికుమార్ ముఠాలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. తనవాటాగా రూ.6 కోట్లు తీసుకున్నాడు. 

వందలకోట్లు ఫ్రాడ్.. దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని ఛేదించాం : స్టీఫెన్ రవీంద్ర

పోలీసులు సాయికుమార్ ను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం పారిపోయాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి మియాపూర్ లో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ మనోజ్ కుమార్ తెలిపారు. సాయికుమార్, డాక్టర్ వెంకట్, నండూరి వెంకటరమణలతో కృష్ణారెడ్డికి మూడేళ్ల నుంచి స్నేహం ఉందని, రియల్ వ్యాపారాలు నిర్వహించాడని ఏసీపీ వివరించారు. Telugu Academy Fixed Depositsను సొంతానికి వినియోగించుకుంటన్న సమయంలోనే.. సాయికుమార్ ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ, ఆయిల్ సీడ్స్ సంస్థలపై కన్నేశాడు. 

ఆరునెలల క్రితం ఆ సంస్థల్లోని నిధులు కాజేయాలని పథకం వేశాడు. బ్యాంక్ అధికారులతో మాట్లాడుకుని అంతా సిద్ధం చేసుకున్నాక కృష్ణారెడ్డిని పలుమార్లు విజయవాడకు పంపించాడు. అక్కడ బ్యాంక్ ఖాతాలను తెరిపించడం, బ్యాంక్ అధికారులతో మాట్లాడ్డం.. ఫిక్స్ డ్ డిపాజిట్లను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాక కృష్ణారెడ్డి ఎవరి మాటలు వారికి పంపించడంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. 

click me!