వందలకోట్లు ఫ్రాడ్.. దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని ఛేదించాం : స్టీఫెన్ రవీంద్ర

By SumaBala BukkaFirst Published Dec 3, 2021, 9:08 AM IST
Highlights

ఓ ముఠా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఎస్బిఐ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.  ఈ కాల్ సెంటర్ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదనట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద Cyber ​​fraudని చేధించినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎస్బిఐ ధనీ బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ పేర్లతో నకిలీ Call centers ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ. వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా Stephen Ravindra మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్ఫూపింగ్ యాప్ దారా ఎస్బిఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి  మోసాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు.

ఓ ముఠా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఎస్బిఐ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.  ఈ కాల్ సెంటర్ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదనట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

SBI agents నుంచి ఖాతాదారుల వివరాలు తీసుకుని Credit card దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. అసలైన ఎస్బిఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు Spoofing app వాడుతున్నారని.. ఈ యాప్ వాడకంలో ఫర్మాన్ హుస్సేన్  అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారని సీపీ తెలిపారు.

1860 180 1290 నెంబర్ ను స్ఫూఫింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30 సెల్ ఫోన్లు,  మూడు లాప్టాప్లు,  కారు,  బైకు  స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. Dhani, Lone Bazaar పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.  ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా  నకిలీ యాప్ తయారు చేసి  మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 

14యేళ్ల బాలుడిపై మేనత్త లైంగిక దాడి.. వీడియో తీసి బ్లాక్ మెయిల్...

Fake website లాగిన్ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకుని ఆ తర్వాత రుణం మంజూరు అయినట్లు చెబుతారని..  ప్రాసెసింగ్ ఫీజు పేరిట  అధిక మొత్తంలో  నగదు తీసుకుంటున్నారని వివరించారు. ఈ ముఠాలో 14 మందిని అరెస్టు చేసి వారి నుంచి  17 ఫోన్లు,  మూడు ల్యాప్టాప్లు,  5 సిమ్ కార్డులు  స్వాధీనం చేసుకున్నట్లు  సీపీ వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అక్టోబర్ లో ఓ  సంచలన నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్సింగి పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్‌ఐలను స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు. సీఐ గంగాధర్, ఎస్‌ఐ లక్ష్మణ్‌లపై భూ వివాదాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు రావడంతో వారిని  సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసు వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారిపోయింది.

కొంత కాలంగా.. ఎస్‌ఐ, సీఐలు ఇద్దరు భూ వివాదాల్లో తలదూర్చినట్టుగా కమిషనర్‌‌ దృష్టికి వచ్చింది. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు కూడా రావడంతో సీపీ Stephen Ravindra వారిపై  చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీపీ అంతర్గత విచారణకు కూడా ఆదేశించినట్టుగా సమాచారం. సీఐ గంగాధర్, ఎస్ఐ లక్ష్మణ్ల బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!