తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు, మనస్తత్వ శాస్త్రంపై ప్రత్యేక ప్రసంగం (వీడియోలు)

First Published Aug 2, 2018, 2:40 PM IST
Highlights

తెలుగు అకాడమీ తన సుదీర్ఘ ప్రయాణాన్ని తెలుగు భాషాభివృద్ది కోసం వెచ్చించిందన్న విషయం తెలుగు భాషాభిమానులకే కాదు యావత్ తెలుగు ప్రజలకు తెలిసిందే. ఆనాడు తెలుగు వెలుగులు విరజిమ్మిన కాలం నుండి నేడు తెలుగు భాష ఆధరణ కోల్పోయే స్థాయివరకు ఆ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. తన 49 ఏళ లసుధీర్ఘ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగు అకాడమీ 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
 
గత కొన్ని రోజులుగా అకాడమీ అధికారులు ప్రత్యేక అతిథులతో వివిధ అంశాలపై ప్రత్యేక ప్రసంగాలు ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మానవ నిత్య జీవితంలో మనస్తత్వ శాస్త్రం అన్న అంశంపై ప్రసంగం సాగింది. ఇందులో మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి వాటి వల్ల నిత్య జీవితంలో కలిగే ప్రయోజనాల గురించి వక్తలు చక్కగా వివరించారు. 

మనస్తత్వ శాస్త్ర ప్రసంగం వీడియో ఏషియానెట్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకం

"

"

click me!