తెలంగాణకు రాహుల్‌: రంగారెడ్డి జిల్లాలో బస్సుయాత్ర

Published : Aug 02, 2018, 01:30 PM ISTUpdated : Aug 02, 2018, 01:37 PM IST
తెలంగాణకు రాహుల్‌: రంగారెడ్డి జిల్లాలో  బస్సుయాత్ర

సారాంశం

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాందీ ఈ నెల 13,14 తేదీల్లో తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్నారు.  రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాందీ ఈ నెల 13,14 తేదీల్లో తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్నారు.  రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని  ఇప్పటి నుండే ప్లాన్  చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల నాటికి రాష్ట్రంలోని వీలైనన్ని ఎక్కువ సభలను నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. 

గత ఏడాది సంగారెడ్డిలో నిర్వహించిన సభతో  కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో  ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ తరహా సభలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా బస్సు యాత్రను నిర్వహించింది.

అయితే మిగిలిన జిల్లాల్లో కూడ యాత్రను కొనసాగించాలని భావిస్తోంది. 

బస్సుయాత్ర ద్వారా ప్రజలను సమస్యలను తెలుసుకోవడంతో పాటు టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను  ఎండగట్టనున్నట్టు ఆ పార్టీ ప్రకటిస్తోంది. అయితే  బస్సు యాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొనేలా చేయడం ద్వారా  కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మస్థైర్యం పెంపొందించేలా  చేయడం కోసం  ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

2019 ఎన్నికల నాటికి తెలంగాణలో వీలైనన్ని  ఎక్కువ బహిరంగసభల్లో రాహుల్‌గాంధీ పాల్గొనేలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. వరంగల్ జిల్లాలో రాహుల్‌ సభను నిర్వహించాలని గత ఏడాది ప్లాన్ చేసింది. కానీ చివరి నిమిషంలో ఈ సభ రద్దైంది. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్